సోషల్ మీడియా వలన ఇప్పుడు ప్రపంచ నలుమూలల ఎటువంటి వింతలు విశేషాలు జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.
ప్రజలు కూడా సోషల్ మీడియాకు బాగా కనెక్ట్ అయిపోయారు.ఈ క్రమంలోనే రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
ముఖ్యంగా ఫన్నీ వీడియోలు సంగతి అయితే చెప్పనవసరం లేదు.పోస్ట్ చేసిన కొద్ది సేపటిలోనే తెగ వైరల్ గా మారిపోతున్నాయి.
అందులోనూ మరి ముఖ్యంగా కిడ్స్ వీడియోస్ అయితే తెగ ట్రేండింగ్ గా మారుతున్నాయి.
పిల్లల వీడియోలు అయితే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.చిన్నపిల్లలు చూడడానికి ఎంతో ముద్దుగా ఉండడంతో పాటు వాళ్ళ మాటలు, చేసే చేష్టలు కూడా చూడముచ్చటగా ఉంటాయి.
వారి వీడియోలను ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ చూడడంతో పాటు లైక్స్ మీద లైక్స్ ఇస్తూ ఉంటారు.
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.ఆ బుడ్డోడి వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుల లోకంలో మునిగిపోవడం మాత్రం గ్యారంటీ.
సాధారణంగా పిల్లలకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం.ఎక్కడ పాటలు వినిపించిన గాని పిల్లలు చిందులు వేయడం మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాము.
సరిగ్గా అలాగే ఒక పిల్లవాడు పాపం ఆదమరిచి గాఢ నిద్రలో మునిగిపోయాడు.అదే సమయంలో ఒక్కసారిగా మ్యూజిక్ ప్లే అవ్వడంతో నిద్రలోంచి లేచి డాన్స్ చేయడం మొదలు పెట్టేసాడు.
అదే సమయంలో ఆ బుడ్డోడి చేసిన డాన్స్ అంతా వీడియో తీసి పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అయింది.
"""/"/
మరి ఒకసారి ఆ వీడియోను పరిశీలిస్తే ఒక కారు వెనుక సీటులో ఒక బాబు ఎంతో గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు.
ఆ బాబు నిద్రించేపట్టపుడు చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నాడు కదా.సరిగ్గా అదే సమయంలో ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సడెన్ గా మ్యూజిక్ ఆన్ చేసి పాటలు పెట్టాడు.
ఆ మ్యూజిక్ సౌండ్‌కు గాఢంగా నిద్రిస్తున్న బాబు ఒక్కసారిగా లేచి కాళ్లు,చేతులు కదుపుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.
నిద్రలోంచి లేచి కూర్చున్న చోటనే డాన్స్ వేసాడు.బాడీని పాటకు తగ్గట్టు మూవ్ చేస్తూ డాన్స్ వేసాడు.
మ్యూజిక్ కు ఉన్న మాయ ఇదేనేమో మరి.ఆ బుడ్డోడి అమాయకపు ముఖాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఈ ఫన్నీ వీడియోను టిక్‌టాక్ ఫన్నీ వైరల్ పేరుతో ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో పాటు వేల సంఖ్యలో వ్యూస్ కూడా వచ్చాయి.
ఈ వీడియో చూసి నెటిజన్లు తమ దైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.