పేదలకు వరం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం( Rajiv Arogyashri Scheme ) పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ) అన్నారు.
స్థానిక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన గోడ పోస్టర్ ను వైద్యాధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు రూ.
10 లక్షల వైద్య సహాయం అందిస్తున్నామన్నారు .గతంలో ఐదు లక్షల వరకే ఆరోగ్య భీమా ఉండగా.
ఇప్పుడు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆ మొత్తాన్ని మా ప్రభుత్వం పది లక్షలకు పెంచిందన్నారు.
ఈ పథకం ద్వారా 1672 రకాల వ్యాధులకు వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పారు.
ఈ పథకం ద్వారా మెరుగైన సేవలందిస్తామని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వైద్య వృత్తి పవిత్రమైనదని వైద్యులు నిరంతరం సేవాలందించాలని సూచించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024