ఇంట్లో బాంబ్ షెల్టర్‌ ప్రత్యక్షం.. కంగుతిన్న న్యూ మెక్సికో దంపతులు..

ఇటీవల అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రం( Mexico )లో ఒక కపుల్ కొత్త ఇల్లు కొని అందులోకి ప్రవేశించారు.

ఆ కొత్త ఇంటిని చూస్తూ అన్నీ చెక్ చేస్తుండగా వారికి ఒక విచిత్రమైన తలుపు కనిపించింది.

ఆ తలుపును తెరిచి చూసినప్పుడు వారు ఎంతో కంగుతిన్నారు.రెడిట్‌ వెబ్‌సైట్‌లో కైల్ అనే వ్యక్తి ఈ సంఘటన గురించి వివరించాడు.

"""/" / కైల్‌మాకేబ్రే ( Kylemacabre ) తన భార్యకు న్యూ మెక్సికోలో ఉద్యోగం వచ్చిన తర్వాత తమ కొత్త ఇంటికి మారవలసి వచ్చిందని రాశాడు.

ఆ ఇల్లు చాలా బాగున్నప్పటికీ, అందులో ఒక రహస్యమైన బేస్‌మెంట్ ఉందని చెప్పాడు.

ఆ బేస్‌మెంట్‌లో ఒక విచిత్రమైన తలుపు ఉందని కూడా చెప్పాడు.మొదట్లో వారు ఆ తలుపు తెరిచి చూడడానికి భయపడ్డారు.

కానీ, తర్వాత ఆయన భార్య లోపలికి వెళ్లి చూడాలని పట్టుబట్టింది. """/" / ఆయన ఆ తలుపు వెనుక మృతదేహం లేదా హారర్ సినిమాల్లో చూపించినట్లుగా డెత్ ఛాంబర్ ఉంటుందని అనుకున్నాడు.

కానీ, లోపల ఉన్న దృశ్యం చాలా భిన్నంగా ఉంది.అది 1980లలో నిర్మించిన బాంబ్‌షెల్టర్ అని తెలిసింది.

అందులో బాత్ రూమ్ వంటి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.ఆ శబ్దాలు వెలుపలికి వెళ్లకుండా నిరోధించే ఆ గదిని మ్యూజిక్ రూమ్‌గా మార్చుకోవాలని కైల్‌మాకేబ్రే నిర్ణయించుకున్నాడు.

అక్కడ ఆయన సౌకర్యంగా పాటలు వినవచ్చుబాంబ్‌షెల్టర్ అంటే వైమానిక దాడులు, బాంబులు, అణు దాడులు, రసాయన దాడుల నుంచి రక్షించే ఒక ఆశ్రయం.

యుద్ధం లేదా ఇతర ప్రమాదాల సమయంలో ప్రజలు దాక్కొని ఉండేందుకు నిర్మించిన భద్రమైన గది అని కూడా చెప్పవచ్చు.

ఇకపోతే స్థానిక ప్రజలు ఆ హిడెన్ బాంబ్‌షెల్టర్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారు.వాళ్లు ఇప్పుడు ఆ బాంబ్‌షెల్టర్ గురించి ఇతరులకు చెప్పాలని అనుకుంటున్నారు.