ప్రతిరోజూ కెమెరా ముందుకి వచ్చి పోజులు ఇస్తున్న పక్షి.. వీడియో వైరల్!
TeluguStop.com
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోలో కనిపించిన కంటెంట్ ఎపిసోడ్ల కొద్దీ తీసినా తాము చూస్తామని కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకీ ఏంటా వీడియో? అందరూ అంతగా చూసేంత ప్రత్యేకత ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఫారెన్ గర్ల్ ఒక ఆవు గురించి ఏదో చెబుదాం అనుకుంది.
ఫోన్ లో వీడియో రికార్డు పెట్టి మరీ ఆవు గురించి చెప్పడం స్టార్ట్ చేసింది.
ఇంతలోనే ఒక పెద్ద ఈము పక్షి అక్కడికి వచ్చింది.కెమెరా ముందు నిల్చొని అది ఫోజులు ఇచ్చింది.
దానికి ఇమాన్యుల్ అనే పేరు పెట్టింది ఈ అమ్మాయి.అయితే ఈము పక్షి కెమెరా ముందుకు వచ్చి తాను చెప్పదలుచుకున్నది అంతా పాడు చేయడంతో దానిని ఆ అమ్మాయి తిట్టేసింది.
అలాగే ఇంకొక ఆవు గురించి ప్రజలకు ఏదో చెబుదాం అనుకుంది కానీ అప్పుడు కూడా ఈ పక్షి కెమెరాకి అడ్డంగా వచ్చింది.
ఇలా చాలాసార్లు అది కెమెరా ముందుకు వచ్చి ఫోజులివ్వడం చూసి ఈ అమ్మాయికి చాలా కోపం వచ్చింది.
ప్రతి రోజు ఇలా చేసి విసిగించకు అని చడామడా అరిచింది.అలా పాపం ఆ అమ్మాయికి దీని వల్ల తిప్పలు తప్పడం లేదు.
దీనికి సంబంధించిన వీడియోని ప్యూబిటీ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.
ఈ వీడియోకి నాలుగు లక్షలకు పైగా లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!