బెజ‌వాడ రాజ‌కీయాల్లో ద‌స‌రా ట్విస్ట్‌… క‌ల‌క‌లం రేపుతోన్న ఆ నేత ఎవ‌రు…!

ఏపీలో ఏ రోజు ఏ క్ష‌ణం రాజ‌కీయం ఎలా మారుతుందో ?  కూడా తెలియ‌డం లేదు.

ఏపీలో ఏం జ‌రిగిన ఎఫెక్ట్ ఎక్కువుగా తెలుగుదేశం మీదే ప‌డుతోంది.అధికార వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉంది.

ఎవ‌రు ఆ పార్టీని త‌ప్పుప‌ట్టినా కూడా కూడా ప్ర‌భుత్వం మాత్రం దూకుడు ఆప‌డం లేదు.

సీఎం జ‌గ‌న్మ‌హ‌న్‌రెడ్డి మాత్రం తాను ఏం చేయాలో చేసుకుపోతున్నారు.బీజేపీ ఏపీలో చేసేదేం లేక‌పోయినా ఆ పార్టీకి క‌లిసొచ్చేది లేదు.

పోయేది లేదు.ఇక టీడీపీ వాళ్లు మాత్ర‌మే అటు వైసీపీలోకి దూకుదామా ?  ఇటు బీజేపీలోకి జంప్ చేసేద్దామా ? అని కాచుకుని ఉన్నారు.

ఇదిలా ఉంటే కీల‌క‌మైన బెజ‌వాడ న‌గ‌ర రాజ‌కీయాల్లో ద‌స‌రాకు ఓ కీల‌క నేత క‌ల‌క‌లం రేపుతున్నాడ‌ని బెజ‌వాడ రాజ‌కీయాల్లో కీల‌క చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఓట‌మి లేకుండా వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న స‌ద‌రు నేత పార్టీలో దూకుడుగా ఉంటున్నారు.

ఎన్నిక‌ల్లో అంద‌రూ ఓడినా తాను గెలిచినా అధిష్టానం త‌న‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌డం లేద‌న్న ఆవేద‌న స‌ద‌రు నేత‌లో గూడుక‌ట్టుకుపోయింది.

ఇక ఆయ‌న గ‌త ఆరేడేళ్లుగా బీజేపీకి చెందిన ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.

ఇక స‌ద‌రు నేత‌పై బీజేపీ నాయ‌కులు కూడా స‌దాభిప్రాయంతో ఉన్నారు.ఇక ఆ బెజ‌వాడ నేత కూడా తాను ఉన్న పార్టీలో క‌నుచూపు మేర‌లో భ‌విష్య‌త్ లేద‌ని స‌న్నిహితుల‌తో ప్ర‌స్తావిస్తున్నార‌ట‌.

ఈ టైంలోనే క‌రెక్ట్ నిర్ణ‌యం తీసుకుంటే భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని కూడా త‌న స‌న్నిహిత‌ల‌తో చ‌ర్చిస్తుండ‌గా.

వారు కూడా కంగారు ప‌డ‌కుండా నిర్ణ‌యం తీసుకోమ‌ని సూచిస్తున్నార‌ట‌.ఇక కొద్ది రోజుల క్రిత‌మే స‌ర‌దు నేత ఢిల్లీ వెళ్లి మ‌రీ కేంద్ర‌మంత్రుల‌ను క‌లిసి వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు బెజ‌వాడ నేత‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఆ కేంద్ర మంత్రి ఆయ‌న్ను బీజేపీలోకి ఆహ్వానించ‌డం.

స‌ద‌రు నేత ఈ విష‌యాన్ని త‌న స‌న్నిహితుల‌కు లీక్ చేయ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం బెజ‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇక ద‌స‌రా నాటికి ఆయ‌న బీజేపీలోకి జంప్ చేసే విష‌య‌మై ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు.

ఈ విష‌యం ఇప్పుడు బెజ‌వాడ‌లో పొలిటిక‌ల్ హాట్ టాపిక్‌గా మారింది.

అటెండెంట్ నుంచి ఎయిర్‌లైన్స్ సీఈఓ దాకా ఎదిగిన మహిళ.. నెటిజన్లు ఫిదా..