విడ్డూరం : భర్త సుఖపెట్టడం లేదని ఆఫీస్ బాయ్‌తో అఫైర్... ఆ కుర్రాడు చేసిన పనితో ఆమె ఆత్మహత్య యత్నం
TeluguStop.com
అక్రమ సంబంధాలు ఒకసారి కాకుంటే మరోసారైనా ప్రమాదకరం.కొన్నాళ్ల పాటు సాఫీగా సాగినా ఎప్పుడో ఒకప్పుడు అయితే అక్రమ సంబంధం అనేది బయట పడటం ఖాయం.
ఈ విషయం ఎంతో మంది విషయాల్లో సాగుతుంది.కాని ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా కొత్త అక్రమ సంబంధాలు పుట్టుకు వస్తూనే ఉన్నాయి.
తాజాగా మరో అక్రమ సబంధం వల్ల రెండు జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి దాంతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం చెల్లా చెదురైన సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
స్టీవ్ బావెన్ మరియు ఎంజోలీలు 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.వీరి సంసారం కొన్నాళ్ల వరకు అంతా సాఫీగానే సాగింది.
కాని కొంత కాలంగా ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి.ఆ విభేదాలకు ప్రధాన కారణం శృంగార సంబంధిత విషయం.
ఎంజోలీ గత కొన్నాళ్లుగా భర్త నుండి సంతృప్తి చెడండం లేదు.స్టీవ్ ఆమెను సంతృప్తి పర్చడంలో విఫలం అవుతున్నాడట.
దాంతో ఆమె జాబ్ చేసే ఆఫీస్‌లోని ఒక బాయ్‌తో అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది.
"""/"/
ఒకరోజు ఆఫీస్ బాయ్‌ను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎంజోలీ ఇంటికి తీసుకు వెళ్లింది.
అప్పటి నుండి ఎప్పుడు వీలున్నా కూడా ఇంటికి తీసుకు వెళ్లడం చేసింది.ఆ ఆఫీస్ బాయ్ వక్రబుద్ది చూపించాడు.
ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు తీసుకు వెళ్లడంతో పాటు, పక్క రూంలో పడుకుని ఉన్న ఎంజోలీ కూతుర్లను అసభ్యంగా ఫొటోలు తీశాడు.
ఆ విషయం ఎంజోలీకి చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.డబ్బు ఇవ్వకుంటే ఫొటోలు బయట పెడతానంటూ బెదిరించడంతో కూతుర్ల జీవితం నాశనం అవుతుందని, విషయం తెలిస్తే తన భర్త చీత్కరించుకుంటాడని భావించి ఆత్మహత్య చేసుకోవాలని స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా మింగేసింది.
అయితే అదృష్టం బాగుండి రెండు రోజుల కోమా తర్వాత బయటకు వచ్చింది.ప్రమాదం నుండి బయట పడ్డ తర్వాత అసలు విషయం చెప్పడంతో పోలీసులు ఆ ఆఫీస్ బాయ్‌ను అరెస్ట్ చేసి అతడి వద్ద ఉన్న ఫొటోలను డిలీట్ చేయించడంతో పాటు అతడిని జైలుకు పంపించారు.
ఎంజోలీ పరిస్థితిని అర్థం చేసుకున్న స్టీవ్ ఆమెను ఏమనకుండా మళ్లీ ఆమెతో ఎప్పలాగే ఉంటున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా ఎంజోలీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.