ఈ నితిన్ చెల్లెలు మీకు గుర్తుందా….?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన "అ.

ఆ." అనే చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

 అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించగా బ్యూటిఫుల్ క్వీన్ సమంత అక్కినేని, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్లుగా నటించారు.

 అలాగే ప్రముఖ విలక్షణ నటుడు రావు రమేష్, సీనియర్ గిరిబాబు, శ్రీనివాస్ అవసరాల, హరితేజ, అనన్య, నదియా, నరేష్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రంలో హీరో నితిన్ చెల్లెలి పాత్రలో నటించిన "అనన్య" తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

అనన్య ఇంతకు ముందే తెలుగులో అమాయకుడు, జర్నీ, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.

 అంతేగాక ఒకప్పుడు మలయాళంలో స్టార్ హీరోయిన్ గా కూడా రాణించింది. కానీ ఆ మధ్య కాలంలో సినిమా అవకాశాలు తక్కువ అవడంతో ప్రముఖ సింగర్ ఆంజనేయన్ ని పెళ్లి చేసుకుంది.

 కాగా ప్రస్తుతం వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది.అయితే పెళ్లయిన తర్వాత కూడా నటి అనన్య అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలలో నటిస్తూనే ఉంది.

కాగా తెలుగులో  ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన "మహర్షి" అనే చిత్రంలో అల్లరి నరేష్ కి జంటగా నటించింది.

కానీ ఈ చిత్రంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ అమ్మడుని ఎవరూ  గుర్తించలేదు.

 కాగా ప్రస్తుతం నటి అనన్య మలయాళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే తమిళంలో "గాడ్ ఫాదర్" అనే చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది.