Miramar Beach: తొలిసారి సముద్రాన్ని చూసిన 72 ఏళ్ల వృద్ధురాలు.. ఆమె రియాక్షన్ ఏంటంటే..
TeluguStop.com
Lబీచ్‌ని సందర్శించడం, విమానంలో ప్రయాణించడం లేదా వేరే దేశానికి వెళ్లడం వంటి కలలు చాలా మందికి ఉంటాయి.
కానీ ఆర్థిక పరిస్థితులు లేదా బిజీ లైఫ్ వల్ల ఈ కోరికలు తీరకుండానే చాలా మంది చనిపోతుంటారు.
చనిపోయే ముందే నెరవేరని డ్రీమ్స్ గుర్తొచ్చి చాలా బాధేస్తుంటుంది.అయితే కొన్నిసార్లు కొంతమంది కోరికలను నెరవేర్చడంలో ఫ్యామిలీ హెల్ప్ చేస్తుంది.
ఇటీవల ఓ కుటుంబం కూడా సరిగ్గా ఇదే పని చేసింది.వీరు సముద్రాన్ని చూడాలనుకునే 72 ఏళ్ల వృద్ధురాలి కలను తీర్చారు.
"""/" /
సముద్రాన్ని తొలిసారి చూసిన ఆ వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్లిప్ నెటిజన్లను సంతోషంలో ముంచెత్తుతోంది.అర్జెంటీనాలోని మిరామర్ బీచ్‌కు( Miramar Beach, Argentina ) ఆమెను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
వీడియోలో కనిపించినట్లుగా సముద్రాన్ని ఫస్ట్ టైమ్ చూసి ఆమె ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతుంది.
చాలా ఉత్సాహపడుతూ దాదాపు కింద పడబోతుంది అదృష్టవశాత్తు ఆమెను కుటుంబ సభ్యులు కింద పడిపోకుండా పట్టుకోగలిగారు.
వారు ఆమెకు సముద్రాన్ని ప్రశాంతంగా చూస్తూ ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారు. """/" /
ఆమె స్విమ్‌సూట్ ధరించి( Wearing A Swimsuit ) నీటిలో లోతుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది.
తను మునిగిపోతే రక్షించడానికి ఓ లైఫ్‌గార్డ్ అవసరమని ఆమె ఫన్నీ కామెంట్ చేసింది.
ఈ వీడియో మొదటగా ఫిబ్రవరి 8న టిక్‌టాక్‌లో షేర్ చేశారు.అయితే ఇది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా బాగా వైరల్ గా మారింది.
న్యూయార్క్ పోస్ట్ శనివారం దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది, మహిళ పేరు ఇసా అని, ఆమెకు 10 మంది పిల్లలు ఉన్నారని పేర్కొంది.
ఈ వీడియోకు చాలా వ్యూస్, లైక్స్ వచ్చాయి.
తన రెమ్యునరేషన్ గురించి వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?