వైరల్: పిట్టకొంచెం కొత్త ఘనం అంటే ఇదే... 6 అడుగుల మనిషిని మట్టికరిపించిన బుడ్డోడు!
TeluguStop.com
"పిట్టకొంచెం కొత్త ఘనం" అనే తెలుగు నానుడి గురించి వినే వుంటారు.అప్పుడప్పుడు దీన్ని నిజం చేసే సంఘటనలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి.
అలాంటి సందర్భాలను ఉదాహరిస్తూనే ఇలాంటి జాతీయాలు పుట్టుకొచ్చాయి.ఇకపోతే భారతదేశంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నాయి.
ఖోఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకూ విశేషమైన ప్రాధాన్యత ఉంది.
ఈ క్రమంలో ఎంతో మంది క్రీడాకారులు ఆటల్లో శిఖరాలను అధిరోహిస్తూ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారు.
ముఖ్యంగా మన ప్రాంతీయ కబడ్డీ ఆట గురించి మాట్లాడుకోవాలి.ఈ ఆట మన చిన్నతనంలో ఆడుకొనేదే.
అయితే ఈ ఆట ఎంత కష్టమో చెప్పాల్సిన పనిలేదు.దీనికి శరీర దృఢత్వం ఎంతో అవసరం.
అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే ఓ బుడ్డోడు చెట్టంత మనిషిని ఈ ఆటలో మట్టి కురిపించడం మనం చూడవచ్చును.
ఈ వీడియోలో కొందరు చిన్నారులు కబడ్డీ ఆడుతుండటాన్ని చూడవచ్చు.వారితో పోలిస్తే మరో చిన్నారి కూడా ఈ క్లిప్ లో కనిపిస్తాడు.
అతను కూడా తోటి వారితో కలిసి ఆడుతాడు.ప్రత్యర్థి కూతకు వచ్చినపప్పుడు ఆ చిన్నారి వెంటనే అలర్ట్ అయ్యి.
అతని కాళ్లు పట్టుకుని లాగాడు.దీంతో అతను అవతలి వైపుకు వెళ్లలేక చిక్కుకుపోతాడు.
"""/" /
ఆ తర్వాత జట్టుసభ్యులందరూ వచ్చి అతనిని కింద పడేసి పాయింట్ సాధిస్తారు.
అయితే ప్రత్యర్థిని పట్టుకున్న చిన్నారి.మిగతా వారితో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉన్నాడు.
ఈ వీడియో చూసిన తర్వాత, కచ్చితంగా పిల్లల ధైర్యానికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది.ఈ అద్భుతమైన వీడియోను ఐపీఎస్ అధికారి ప్రహ్లాద్ మీనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
‘వయస్సు ద్వారా కాదు, ఒక వ్యక్తి తన విశ్వాసం, దృఢ సంకల్పం, ఉన్నత స్ఫూర్తితో అతి పెద్ద కష్టాన్ని అధిగమించగలడు’ అనే క్యాప్షన్ కు రాశారు.
ఈ క్లిప్ కేవలం 30 సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్య, 57 వేలకు పైగా లైక్స్ వస్తున్నాయి.