అద్భుతం.. ఆశ్చర్యం.. తండ్రీకూతుర్లను కలిపిన ఫేస్‌బుక్‌..!

సోషల్ మీడియా వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అంతే స్థాయిలో ఉపయోగాలూ ఉన్నాయి.

ఇది ఇప్పటికీ చాలామంది విషయంలో నిరూపితమైంది.అంతెందుకు సోషల్ మీడియా వల్లే మారుమూల ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు సెలబ్రిటీలు అవ్వడం చూస్తూనే ఉన్నాం.

అంతటి మహిమ ఉన్న సోషల్ మీడియా చిన్నప్పుడు విడిపోయిన వారిని సైతం కలిపేందుకు ఒక వేదికగా మారుతోంది.

ముఖ్యంగా ఫేస్‌బుక్‌ ఇప్పటికే విడిపోయిన వారినందరినో కలిపింది.తాజాగా కూడా తండ్రీ కూతుర్ల కలపడంలో ఫేస్‌బుక్‌ కీలక పాత్ర పోషించింది.

58 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుసుకోవడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఎవరా తండ్రీకూతుర్లు ? ఎలా కలుసుకున్నారు?వివరంగా తెలుసుకుంటే.ఇంగ్లండ్‌, లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లెయిడ్‌(59) అనే మహిళ తన ఏడాది వయసులోనే తండ్రి నుంచి తప్పిపోయింది.

58 ఏళ్ల క్రితం టెక్నాలజీ ప్రస్తుత స్థాయిలో లేకపోయేది.ఆ సమయంలో తన కూతురిని ఎలా కలుసుకోవాలో తెలియక తండ్రి తల్లడిల్లిపోతాడు.

జూలీ కూడా చనిపోయేలోపు తండ్రిని చూడాలని దృఢంగా నిశ్చయించుకుంది.ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకుండా ఆమె అన్ని మార్గాల ద్వారా తండ్రి ఆచూకీని వెతికేందుకు ప్రయత్నించింది.

ఈ సమయంలోనే ఆమెకు ఒక ఐడియా తట్టింది. """/"/ అదేంటంటే తానొక్కటే ప్రయత్నించడం కంటే ఫేస్‌బుక్‌ యూజర్ల సాయం తీసుకుంటే తండ్రి ఆచూకీ లభ్యం అయ్యే అవకాశం ఉందని భావించింది.

ఈ ప్రయత్నంలో భాగంగా ఆమె తండ్రి ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసి."దయచేసి నా తండ్రిని గుర్తించడంలో సాయం చేయండి" అని నెటిజన్లను కోరింది.

అయితే కొద్దిరోజుల్లోనే నెటిజన్లు ఆమె తండ్రి ఆచూకీ తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

ఆ అడ్రస్ కు వెళ్లి తండ్రిని కలుసుకుంది జూలీ. """/"/ ఇప్పుడు ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

వెస్ట్ యార్క్‌షైర్‌లోని డ్యూస్‌బరీలో తండ్రితో కలుసుకొని హాయిగా ఎంజాయ్‌ చేసింది.అలాగే తన తండ్రితో కలిసి తిరుగుతూ చిన్నపిల్లలా అల్లరి చేస్తోంది.

తండ్రిని కలిసిన సందర్భంగా జూలీ మాట్లాడుతూ.''అద్భుతాలు జరుగుతాయని నేను అసలు నమ్మను.

కానీ ఫేస్‌బుక్‌ నాకు చేసిన సాయం చూస్తుంటే.అద్భుతాలు కూడా జరుగుతాయని నమ్మక తప్పడం లేదు'' అని చెప్పుకొచ్చింది.

మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా చూడాలని చంద్రబాబు లేఖ..!!