వ‌ల‌కు చిక్కిన భారీ సొర‌చేప‌.. చివ‌ర‌కు ఏం చేసిందంటే..?

వేట ఎక్క‌డైనా ప్ర‌మాదమే.అది అడ‌విలో అయినా స‌ముద్రంలో అయినా.

అడ‌విలో క్రూర మృగాలు వేటాడుతాయి.అదే స‌ముద్రంలో అయితే సొర‌చేప‌ల్లాంటివి ప్ర‌ధానంగా వేటాడుతాయి.

మ‌రి క్రూర జంతువుల‌ను వేటాడాలంటే ఎంత సాహసం చేయాలో స‌ముంద్రంలో సొర చేప‌ల‌ను వేటాడాల‌న్నా అంతే సాహ‌సం చేయాలి.

ఏ మాత్రం తేడా వ‌చ్చినా ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి.అయితే ఇప్పుడు యూకేకు చెందిన ఓ వ్య‌క్తి చేసిన ప‌ని చూస్తే షాక్ అయిపోతారు.

వృత్థి రీత్యా మ‌త్స్య కారుడు కావ‌డంతో సముద్రంలో చేప‌ల వేటకు వెళ్లాడు.అయితే త‌న వ‌ల‌కు అనుకోకుండా ఓ భారీ సొర‌చేప ప‌డ‌టంతో అత‌డు ఓ అరుదైన రికార్డును కూడా బ‌ద్ద‌లు కొట్టేశాడు.

అదేంటంటే స‌ముద్రంలో భారీ సొర‌చేప ప‌డ్డ వ్య‌క్తిగా ఆయ‌న‌కు గుర్తింపు వ‌చ్చేసింది.ఈ రికార్డు 1993లో ఓ మ‌త్స్య‌కారుడి పేరు మీద ఉంది.

ఆయ‌న‌కు 229 కిలోల సొర‌చేప చిక్క‌గా ఇప్పుడు ఇత‌నికి అంత‌కంటే పెద్ద చేప దొరికింది.

యూకేలోని నార్తాంప్టన్‌షైర్‌లో నివ‌సిస్తున్న సైమన్ డేవిడ్సన్ డెవోన్ అనే వ్య‌క్తి చేప‌లో ఏకంగా 250 కిలోలున్న‌ భారీ సొర‌చేప చిక్క‌డంతో అత‌ను ప్ర‌పంచ రికార్డును కొట్టేశాడు.

"""/"/ కాగా ఇలా సొర‌చేప దొరికిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగానే హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇక ఈ విధంగా సొర‌చేప ప‌డ‌టంపై సైమన్‌ మాట్లాడుతూ ముందుగా తానేదో మామూలు చేప అనుకున్నాన‌ని, కానీ తీరా చూస్తే అది సొర‌చేప కావ‌డంతో తాను ఆశ్చ‌ర్య‌పోయానంటూ చెప్పుకొచ్చాడు.

అయితే దాదాపు గంటకు పైగా దానితో స‌మ‌స్య‌లు ప‌డ్డామ‌ని, ఎంతో శ్ర‌మిస్తే గానీ అది పడవలోకి రాలేదంటూ చెప్పుకొచ్చాడు.

ఇక దాన్ని ప‌డ‌వ‌లోకి తీసుకొచ్చిన త‌ర్వాత అది సొర‌చేప అని తెలుసుకుని చివ‌ర‌కు దాన్ని స‌ముద్రంలోనే వ‌దిలేశారు.

కాగా అలా వ‌దిలేముందు దాని కొల‌త‌లు తీసుకున్నారంట‌.

రూ. వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా.. వైఎస్ షర్మిల ఛాలెంజ్