హమాస్ చెరలో 19 ఏళ్ల సైనికురాలు.. ఆమె మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది!
TeluguStop.com
ఇజ్రాయెల్-హమాస్( Israel-Hamas ) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, హమాస్ తాజాగా ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది.
ఆ వీడియోలో 19 ఏళ్ల లిరి అల్బాగ్ ( Liri Albagh )అనే ఇజ్రాయెల్ సైనికురాలు కనిపించారు.
ఏడాదికి పైగా పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ చెరలో బందీగా ఉన్న ఆమె చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు.
2023 అక్టోబర్ 7న గాజా సరిహద్దులోని నహల్ ఓజ్ సైనిక స్థావరంపై హమాస్ దాడులు చేసిన సమయంలో అల్బాగ్ అపహరణకు గురయ్యారు.
ఆ భయంకర దాడిలో 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, అల్బాగ్‌తో పాటు మరో ఆరుగురిని హమాస్ బందీలుగా పట్టుకుపోయింది.
"""/" /
మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అల్బాగ్ తన వేదనను వ్యక్తం చేసింది.
"నేను 450 రోజులకు పైగా బందీగా ఉన్నాను.నాకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, కానీ నా జీవితం ఇక్కడ ఆగిపోయింది," అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇజ్రాయెల్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, అక్కడ నరకం అనుభవిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
హీబ్రూ భాషలో( Hebrew ) ఆమె మాట్లాడిన మాటలు వింటుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.
బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న తమ పిల్లలను కాపాడాలంటూ లిరి కుటుంబం ప్రధాని బెంజమిన్ నెతన్యాహును వేడుకుంది.
బందీలను తమ సొంత పిల్లలుగా భావించి, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని కన్నీటితో ప్రాధేయపడింది.
"""/" /
ఈ ఘటనపై ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ( Prime Minister Benjamin Netanyahu )స్పందిస్తూ, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు.
హమాస్‌ను హెచ్చరిస్తూ, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న సమయంలో హమాస్ ఈ వీడియోను విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
బందీల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఈ వీడియో చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం. మేకను రేప్ చేసిన కామాంధుడు.. వీడియో వైరల్..