పదో తరగతి ఆన్సర్ పేపర్ లో పుష్ప డైలాగ్ రాసిన స్టూడెంట్.. రాసేదేలే అంటూ?

సినిమాలు చూసే ప్రేక్షకులలో విద్యార్థులు, యువత ఎక్కువ సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే.

సినిమాలలోని డైలాగుల ప్రభావం విద్యార్థులపై కూడా కొంతమేర ఉంటుందని చెప్పవచ్చు.అయితే ఒక విద్యార్థి మాత్రం పదో తరగతి ఆన్సర్ షీట్ లో ఏకంగా పుష్ప సినిమా డైలాగ్ ను రాశారు.

విద్యార్థి ఆన్సర్ షీట్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

విద్యార్థి పరీక్షలో "పుష్ప.పుష్పరాజ్.

పరీక్ష రాసేదేలే" అని పేర్కొన్నారు.పుష్ప సినిమా ప్రభావం విద్యార్థులపై ఊహించని స్థాయిలో పడిందని ఈ ఘటన వల్ల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే విద్యార్థి చేసిన పని మాత్రం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.పదో తరగతి ఆన్సర్ పేపర్ లో ఇలా రాయడం వల్ల విద్యార్థి తన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు మాత్రం పుష్పరాజ్ మ్యానియాకు ఈ ఘటన నిదర్శనం అని చెబుతున్నారు.ఆన్సర్ షీట్ ను చూసిన ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోను షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పుష్ప1 విడుదలై మూడున్నర నెలలు అయినా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులపై ఈ సినిమా ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు.

"""/"/ తగ్గేదేలే అనే డైలాగ్ పుష్ప సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఒక విధంగా కారణమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ సినిమాపై ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమాకు హిందీ హక్కులను బన్నీ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది.దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఈ సినిమా కోసం సుకుమార్ సైతం తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని సమాచారం.

నయనతార భర్తతో గొడవ గురించి స్పందించిన విజయ్ సేతుపతి.. అసలు సమస్య ఇదేనా?