లోను కావాలంటే కోరిక తీర్చాలన్న బ్యాంకు మేనేజర్ కు బుద్ది చెప్పిన మహిళ. ! వీడియో చూడండి!
TeluguStop.com
తన కోరిక తీర్చాలన్న బ్యాంక్ మేనేజర్ కు చుక్కలు చూపించిందో మహిళ.ఓ పక్క దేశవ్యాప్తంగా తమకు ఎదురైన లైంగిక వేధింపులపై పలువురు మహిళలు సోషల్ మీడియా వేదికగా ముందుకు వస్తుండటంతో ‘మీ టూ’ ప్రచారం ఊపందుకుంది.
దీనిపై స్పందించిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ.
‘మీ టూ’ కోసం సీనియర్ జ్యూడిషల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇది ఇలా ఉండగా.కర్ణాటకలోని దావనగెరెలో లోను కోసం ఒక మహిళ బ్యాంకుకు వెళ్లింది.
లోను కావాలంటే కోరిక తీర్చాలని సదరు బ్యాంక్ మేనేజర్ వెకిలి వేషాలు వేశాడు.
ఏంటని సదరు మహిళ ప్రశ్నించగా.ఆమెతో బ్యాంక్ మేనేజర్ అసభ్యంగా మాట్లాడుతూ.
లైంగిక వేధింపులకు గురిచేశాడు.ఒళ్ళు మండిపోయిన ఆమె… అతడిని బ్యాంకు బయటకు తీసుకువచ్చి కర్రతో చితకబాదింది.
‘నన్నే వేధిస్తావా.నీకెంత ధైర్యం.
మీ హెడ్ ఎవరు ఫోన్ చేయ్ అంటూ.ఆడవాళ్లంటే అంత చులకనా’ అంటూ ఉతికి ఆరేసింది.
పక్కనే ఉన్న జనాలు తమ సెల్ ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాంతో ఇది కాస్త వైరల్ గా మారింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
.
వామ్మో.. ఐస్ క్రీమ్ లో ఇంత పెద్ద పాము ఏంటి భయ్యా!