90 శాతం వసూళ్లు డ్రాప్..’ఆదిపురుష్’ పని ఇక అయ్యిపోయినట్టే!

మన టాలీవుడ్( Tollywood ) లో ఈ సమ్మర్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది.

పెద్ద హీరోల సినిమాలు విడుదలై దాదాపుగా ఏడాది కావొస్తుంది, అలాంటి సమయం లో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరో గా నటించిన 'ఆదిపురుష్'( Adipurush' ) చిత్రం విడుదల అవ్వబోతుంది అనడం తో ట్రేడ్ లో కొత్త ఆశలు చిగురించాయి.

మళ్ళీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కళకళలాడిపోతుంది అని అనుకున్నారు.అనుకున్నట్టు గానే ఈ సినిమా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టింది.

మొదటి మూడు రోజులు వచ్చిన వసూళ్లకు మరియు మొదటి ఆట నుండి వచ్చిన నెగటివ్ టాక్ కి అసలు సంబంధమే లేదు.

ఆ స్థాయి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నాల్గవ రోజు దారుణంగా పడిపోయింది.

"""/" / ముందు రోజు ఆదివారం తో పోలిస్తే 70 నుండి 80 శాతం వసూళ్లు డ్రాప్ అవ్వగా, ఇప్పుడు ఏకంగా ఐదవ రోజు ఏకంగా 90 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

నాల్గవ రోజు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ఐదవ రోజు కనీసం 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదని అంటున్నారు.

కానీ సిటీస్ లో 3D షోస్ కి మంచి రెస్పాన్ వస్తుంది.నూన్ షోస్ పెద్దగా బాగాలేకపోయిన, ఫస్ట్ షోస్ నుండి మాత్రం డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను దక్కించుకుంటుంది.

మరోపక్క హిందీ లో కూడా వసూళ్లు దారుణంగా పడిపోయాయి, కొన్ని సంఘాలు అయితే 'ఆదిపురుష్' మన రామాయణం కాదని, రామాయణం( Ramayanam ) ని అపహాస్యం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాని వెంటనే బ్యాన్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.

"""/" / ఈ సినిమా ప్రభాస్ కి ఎంత మేలు చేసింది అనేది పక్కన పెడితే, నార్త్ ఇండియా లో ఆయనకీ దారుణమైన డ్యామేజీ చేసిందనే చెప్పాలి.

సినిమా బాగాలేకపోయిన పర్వాలేదు కానీ, మన పురాణం ని వెక్కిరిస్తూ డైరెక్టర్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో స్థానం లో ఉండి కూడా ఆపలేకపోయాడని, అందుకే నార్త్ ఇండియన్స్ ప్రభాస్ పై చాలా కోపం గా ఉన్నట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

మరి 'ఆదిపురుష్' చిత్రం ఎఫెక్ట్ ప్రభాస్ రాబొయ్యే సినిమాల పై పడుతుందా.?, ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న 'సలార్'( Salar ) చిత్రం పై కూడా నార్త్ ఇండియా లో ఆడియన్స్ బ్యాన్ చేస్తారా అనేది చూడాలి.

కాసేపు క్రితమే మరో వంద రోజుల్లో సలార్ చిత్రం విడుదల అవ్వబోతుంది అంటూ ఒక పోస్టర్ విడుదల చేసారు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రాబోతుంది.

స్పెయిన్ సీక్రెట్ రివీల్డ్: 6,000-ఇయర్-ఓల్డ్ బ్రిడ్జ్ వెలుగులోకి..?