బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) హజరుపరిచారు.

ఈ నేపథ్యంలో కవితను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.

సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితను తొమ్మిది రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

దీంతో ఈ నెల 23 వ తేదీ వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.

ఈ క్రమంలో ఆమెను సీబీఐ అధికారులు ( CBI Officers )తీహార్ జైలుకు తరలించనున్నారు.

మరోవైపు కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇది సీబీఐ కస్టడీ కాదని.

బీజేపీ కస్టడీ అని ఆరోపించారు.బయట బీజేపీ వాళ్లు మాట్లాడేది లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని తెలిపారు.

బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?