భారతీయులకు కువైట్ షాక్: ప్రవాసీ కోటా బిల్లు… బలవంతంగా 8 లక్షల మంది వెనక్కి..?

ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన లోకల్ నినాదం ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పాకింది.

వివిద దేశాల నుంచి విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు కోసం వచ్చిన విదేశీయులు తమ పౌరులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని కొన్ని దేశాలు రగిలిపోతున్నాయి.

దీనికి కరోనా తోడు కావడంతో ప్రపంచదేశాలు వలసలపై దృష్టిసారించాయి.దీంతో తమ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో వీసా ఆంక్షలు విధిస్తూ విదేశీయులపై వేటు వేస్తున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ప్రవాసులపై ఆంక్షలు విధించగా.తాజాగా ఈ లిస్ట్‌లోకి కువైట్ కూడా చేరింది.

విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడంలో భాగంగా తీసుకొచ్చిన ‘ప్రవాసీ కోటా’ ముసాయిదా బిల్లుకు కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది.

కువైట్ మరింత సమగ్రమైన ప్రణాళికను రూపొందిస్తున్నందున, ఈ బిల్లును మరో కమిటీ పరిశీలించాల్సి వుంది.

ఈ బిల్లు చట్టంగా మారితే అక్కడ నివసిస్తున్న సుమారు 8 లక్షల మంది భారతీయులను బలవంతంగా బయటకు పంపేందుకు వీలు కలుగుతుంది.

కువైట్‌లో భారతీయుల సంఖ్యను దేశంలోని 4.8 మిలియన్ల జనాభాలో 15 శాతానికి కుదించాలని బిల్లులో ప్రతిపాదించారు.

ప్రస్తుతం అక్కడ భారతీయుల జనాభా 1.4 మిలియన్లు కాగా.

15 శాతం అంటే 6.5 నుంచి 7 లక్షలకు పరిమితమవుతుంది.

"""/"/ ఇక్కడ భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారి సంఖ్యను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు.

భారత్ తర్వాత ఎక్కువగా వున్నఈజిప్షియన్ల సంఖ్యను 10 శాతానికి కుదించాలని ముసాయిదాలో సూచించారు.

మరోవైపు భారతదేశానికి విదేశీ ద్రవ్యాన్ని పెద్ద మొత్తంలో అందించే దేశాల్లో కువైట్ ఒకటి.

కోవిడ్ 19 ప్రారంభమైనప్పటి నుంచి విదేశీయుల సంఖ్యను తగ్గించాలని దేశంలోని ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పిలుపునివ్వడంతో అక్కడ ఉద్యమం మొదలయ్యింది.

దీంతో మొత్తం విదేశీ కార్మికులను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్‌ ప్రతిపాదించారు.

మరోవైపు కువైట్‌లో జరుగుతున్న పరిణామాలను అక్కడి భారత రాయబార కార్యాలయం గమనిస్తోంది.కువైట్‌లో ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.

చమురుపైనే ఆధారపడిన మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో వెళ్లే అవకాశం వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి5, ఆదివారం 2025