ఏపీలో బస్సులు తిప్పలేమంటున్న ప్రైవేటు ట్రావెల్స్.. ?
TeluguStop.com
కరోనా వల్ల ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాల నిట్టూర్పులు అన్నీ ఇన్నీ కావు.
కాలు బయట పెట్టలేని పరిస్దితి.ఎవరిని నమ్మలేని పరిస్దితి.
బయటకు వెళ్లుదామంటే భయం.ఇలాంటి దుస్దితి మధ్య జీవనాన్ని గడుపున్నారు ప్రస్తుతం ప్రజలు.
ఇక ఏపీలో కూడా కోవిడ్ కేసులు ఆగడం లేదు.వరుసగా నమోదు అవుతున్న ఈ కరోనా కేసుల వల్ల ఏపీలో నిన్నటి నుండి దాదాపు 880 ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి.
ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో సగం మంది ప్రయాణికులతోనే బస్సులను నడిపించాలని నిర్ణయించడం, అదీగాక ప్రయాణాలు చేసేందుకు ప్రజలు కూడా పెద్దగా ఆసక్తిని చూపక పోవడంతో, వస్తున్న నష్టాలను భరించ లేక ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు తమంతట తాముగానే రవాణా శాఖను సంప్రదించి, బస్సులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.
కాగా వీరి అభ్యర్ధనకు స్పందించిన రవాణా శాఖ అధికారులు చెల్లించాల్సిన పాత పన్నులను చెల్లించి,సర్వీసులను నిలిపివేసుకోవచ్చని తెలిపిందట.
కావున ఏపీలో ప్రైవేట్ బస్సులు ఆగిపోతున్నాయని తెలుస్తుంది.
వైట్ హౌస్‌లో దుబాయ్ బిలియనీర్‌తో ఎలాన్ మస్క్ బ్రేక్‌ఫాస్ట్.. పక్కన భారత సంతతి పార్ట్‌నర్?