చేయని తప్పుకు శిక్ష అనుభవించి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే మందలిస్తారు, ఎక్కువైతే శిక్షిస్తారు.అయితే మరీ దారుణంగా ఇలాంటి శిక్షలు కూడా విధిస్తారా అని అనిపిస్తుంది ఈ ఘటన గురించి మాత్రం తెలుసుకుంటే.

ఈ ఘటన వెస్ట్ వర్జీనియా లో చోటుచేసుకుంది.వెస్ట్ వర్జీనియాలో నివసిస్తున్న రేలీ జాలీన్ బ్రౌనింగ్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి పై పిన తల్లి విధించిన దారుణమైన శిక్ష కు ఆ చిన్నారి ప్రాణాలనే పోగొట్టుకుంది.

వివరాల్లోకి వెళితే.జూలీ టిట్చేనెల్ 'మిస్ ఓక్ లిఫ్ 2019' అందాల పోటీలో విజేతగా నిలిచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.

అయితే ఆమె రేలి అనే ఎనిమిదేళ్ల చిన్నారి తండ్రి మార్టీ బ్రైనీ తో కలిసి సహజీవం చేస్తుంది.

అయితే 2018 డిసెంబర్ లో రేలీ గదిలో కొన్ని అభ్యంతరకరమైన వస్తువులు కనిపించడం తో పిల్ల ఎదో పాడు పని చేసింది అని భావించి దారుణంగా ఆ చిన్నారిని కొట్టడమే కాకుండా ఆ తరువాత గదిలో పడేసి మూడు రోజుల పాటు కనీసం మంచి నీళ్లు సైతం ఇవ్వలేదు.

దీనితో ఆ చిన్నారి ఏమి చేయాలో తెలియక దాహం వేసినప్పుడు టాయ్ లెట్ వాటర్ తాగి దాహం తీర్చుకొనేది.

అయితే ఈ కారణంగా ఆ చిన్నారి కడుపులో 'సెప్సిస్' అనే విషపూరిత బ్యాక్తీరియా చేరడం తో అస్వస్థతకు గురై ఏడాది తరువాత మృతి చెందినట్లు తెలుస్తుంది.

దీనితో జూలీ తో పాటు ఆమె భర్త మార్టీ బ్రైనీ కూడా జైలుపాలయ్యాడు.

రేలీ గదిలో అభ్యంతరకర వస్తువుల దొరికిన రోజు రాత్రి పిన తల్లి జూలీ సోదరి షేరి బ్రౌనింగ్ నిద్రపోయినట్లు తెలుస్తుంది.

అయితే ఆ వస్తువులు తనవే నని షేరి చెప్పకపోవడం తో ఇలాంటి ఘటన జరిగినట్లు తెలుస్తుంది.

దీనితో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఒక్కొక్కరికీ లక్ష డాలర్లు (రూ.

7,076,944) జరిమానా విధించారు.అంతేకాకుండా ఈ ఘటన తర్వాత ‘మిస్ ఓక్ లిఫ్ 2019’ నిర్వాహకులు జూలీ నుంచి కిరీటాన్ని కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?