ఏటా 184 కోట్లు సంపాదిస్తున్న బుడ్డోడు

ప్రపంచంలో డబ్బు సాంపాదించడం కోసం అనేక మంది అనేక పాట్లు పడుతుంటారు.కొందరు ఏళ్ల తరబడి కష్టం చేసి డబ్బులు సంపాదిస్తే, మరికొందరు అదృష్టం కారణంగా తొందరగా ధనవంతులు అవుతారు.

కానీ టెక్సాస్‌కు చెందిన ఓ 8 ఏళ్ల బుడతడు ఏటా కోట్ల ఆదాయం సంపాదిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

టెక్సాస్‌కు చెందిన షియాన్ కాజీ, లోన్ కాజీ దంపతలు 8 ఏళ్ల కొడుకు ర్యాన్ కాజీ తన పేరుపై ఓ యూట్యూబ్ ఛానెల్‌ నడుపుతున్నాడు.

ర్యాన్ మూడేళ్ల వయసులో అతడి తల్లిదండ్రులు ఈ ఛానెల్ మొదలుపెట్టారు.అయితే తొలుత ఈ ఛానల్‌ను జనం పెద్దగా పట్టించుకునే వారు కాదు.

మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఆటవస్తువుల ప్రత్యేకతను ర్యాన్ వివరిస్తాడు.క్రమంగా ఈ ఛానల్‌కు ప్రేక్షకులు పెరగడంతో 2018లో ర్యాన్ ఏకంగా 22 మిలియన్ డాలర్లు సంపాదించాడు.

ఇక 2019లో ఈ సంపాదన 26 మిలియన్ డాలర్లకు చేరింది.తాజాగా ఈ బుడతడు ఫోర్బ్స్ జాబితాలో ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబర్‌గా చోటు కూడా సంపాదించుకున్నాడు.

ర్యాన్ యూట్యూబ్ ఛానల్‌కు 30 మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.2015 నుంచి ర్యాన్ కాజీ వీడియోలకు ఆదరణ పెరిగిందని అతడి తల్లిదండ్రులు తెలిపారు.

ఇప్పుడు ర్యాన్ ఇచ్చే ఆటవస్తువుల రివ్యూల కోసం జనం ఎదురుచూస్తుంటారని వారు తెలిపారు.

ఏదేమైనా ఇంత చిన్న వయసులో కోట్లు సంపాదిస్తున్న ఈ బుడ్డోడికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.