పోలీస్ గ్రీవెన్స్ డే కు 8 ఫిర్యాదులు

సూర్యాపేట జిల్లా:సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 8 ఫిర్యాదులు వచ్చాయి.

ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించామని,ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.