కిలోల చొప్పున ఇసుక తినేస్తున్న అవ్వ.. ఇదేం విడ్డూరం అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు..!

ఇసుక తింటే ఆరోగ్యానికి మంచిదా? ఇసుకను మించిన పోషకాహారమే లేదా? ఏ రోగం దరిచేరకుండా ఉండాలంటే ఇసుకను పంచదార వలె రోజూ కిలోల చొప్పున తినాలా? అని అడిగితే అవుననే అంటోంది ఓ వృద్ధురాలు.

ఇసుక ఏంటి? కిలోల చొప్పున తినడం ఏంటి? అని ఆశ్చర్యపోకండి.ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన కుష్మావతి దేవి (75) ప్రతిరోజూ ఇసుకను ఆబాగా తినేస్తోంది.

గత ఆరు దశాబ్దాలుగా ఆమె ఇసుకనే ఆహారంగా తీసుకుంటోంది.గమ్మత్తేమిటంటే, దాదాపు 60 ఏళ్లుగా రోజూ రెండు కిలోల చొప్పున ఇసుక తిన్నా కూడా ఆమె ఆరోగ్యంగానే ఉంది.

ఇసుక తింటే తనకేం కాదని.నిజానికి ఇసుకే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతుండటం విశేషం.

ఈ వింత ఆహారపు అలవాటుతో ఆమె దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తోంది.

ఇసుక ఎలా అలవాటు అయిందంటే.15 లేదా 18 ఏళ్ల ప్రాయంలో కుష్మావతి దేవికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.

దాంతో కాస్త బూడిద తినాలని ఆమెకు వైద్యులు సూచించారు.అలా తొలిసారిగా బూడిద తిన్న కుష్మావతి ఆ తరువాత ఇసుక తినడం ప్రారంభించింది.

క్రమంగా అది అలవాటుగా మారిపోయింది.కుష్మావతి బ్రేక్ ఫాస్ట్ సకాలంలో చేయకపోయినా.

ఇసుకను మాత్రం ప్రతిరోజూ మూడు పూటలా తింటుంది.అయితే ఆమె ఇసుకను శుభ్రంగా కడిగిన తర్వాతనే తింటుందట.

చోలాపూర్​లోని కఠారి గ్రామంలో నివసిస్తున్న కుష్మావతికి ఇద్దరు కుమారులు ఉన్నారని.వారికి ముగ్గురు బిడ్డలు ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.

"""/" / వారంతా కూడా ఇసుక తినడం మానుకోవాలని ఆమెకు ఎంత విజ్ఞప్తి చేసినా.

ఫలితం లేకపోయింది.డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పినా ఆమె రానని మారాం చేస్తుంటుంది.

తనకిష్టమైన ఇసుక తినవద్దని కుటుంబ సభ్యులు పదే పదే బలవంత పెడుతున్నారని ఆమె ఏకంగా ఇంటినే మార్చేసింది.

ప్రస్తుతం ఆమె కుటుంబానికి దూరంగా ఓ ప్రత్యేక ఇంట్లో నివసిస్తోంది.ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఆమె ఎంతో యాక్టివ్ గా పొలం పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

"""/" / ఇదిలా ఉండగా, అనారోగ్య సమస్య వల్లే కుష్మావతి ఇసుక తింటూ ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా శరీరంలో జింక్, ఐరన్ లోపం ఉన్నవారు ఇసుక తినాలనే తపనతో ఉంటారని చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ, కుష్మావతి తన విచిత్రమైన అలవాటుతో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చెయ్యాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టరే బెస్ట్…