ట్రంప్‌ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్.. సీక్రెట్ సర్వీస్ అదుపులో 72 ఏళ్ల వ్యక్తి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించిన ఓ 72 ఏళ్ల వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు న్యూయార్క్‌లో సోమవారం అరెస్ట్ చేశారు.

నిందితుడిని థామస్ వెల్నిక్‌గా గుర్తించారు.ఈ కేసుకు సంబంధించి సోమవారం బ్రూక్లిన్ కోర్టులో వాదనలు జరిగాయి.

ఉద్దేశపూర్వకంగానే థామస్.ట్రంప్‌ను బెదిరించినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్.ప్రజాస్వామ్య బద్ధంగా అధికార మార్పడికి అంగీకరించకపోగా.

కోర్టుల్లో దావాలు వేసి నానా రచ్చ చేశారు.దీనిని ముందే ఊహించిన థామస్.

2020 ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయి పదవి నుంచి వైదొలగడానికి నిరాకరిస్తే ఆయుధాలు సంపాదించి అధ్యక్షుడిని చంపేస్తానని బెదిరించాడు.

2020 జూలైలో యూఎస్ క్యాపిటల్ పోలీసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు.

అంతేకాకుండా గతేడాది జనవరిలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో వున్న సీక్రెట్ సర్వీస్ కార్యాలయానికి రెండు వాయిస్ మెసేజ్‌లను కూడా పంపినట్లు మెల్నిక్‌పై ఆరోపణలు వున్నాయి.

అందులో నిందితుడు.ట్రంప్‌తో పాటు 12 మంది కాంగ్రెస్ సభ్యులను చంపుతానని బెదిరించాడు.

మెల్నిక్ గత నవంబర్‌లో న్యూయార్క్‌లోని సీక్రెట్ సర్వీస్ డెస్క్‌కి మూడు సార్లు కాల్ చేసినట్లు కూడా అతనిపై అభియోగాలున్నాయి.

ఈ కేసులో థామస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది కోర్ట్.అతనిని రాత్రిపూట గృహ నిర్బంధం చేయాలని .

అలాగే జీపీఎస్ మానిటరింగ్ పరికరాన్ని అమర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు.దీనికి అదనంగా అతనికి మానసిక చికిత్సను అందించాలని కోర్టు తెలిపినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు.

మరోవైపు జనవరి 6 కాపిటల్ బిల్డింగ్‌పై దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.

ఇందులో ప్రమేయమున్న వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

దీనికి తోడు ఈ తిరుగుబాటు వ్యవహారంలో ట్రంప్ పాత్రను తేల్చేందుకు కాంగ్రెస్ హౌస్ కమిటీ సైతం వేగంగా పావులు కదుపుతోంది.

చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో…