అక్క‌డ కిలో ప‌చ్చిమిర్చి రూ.710.. దివాలా దిశ‌గా ఆ దేశం..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది.కోవిడ్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల వ్యాపారాలు మూత పడ్డాయి.

కొన్ని దేశాలైతే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.అటువంటి దేశాల జాబితాలో మొదటగా ఉండేది సింహాళ దేశం అలియాస్ శ్రీలంక.

అక్కడి పరిస్థితులు మరీ దుర్భరంగా ఉన్నాయి.అక్కడి ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసి ఆహారం కూడా తినలేకుండా ఉన్నారంటే పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయే మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఆ దేశంలో కూరగాయాల ధరలు మండిపోతున్నాయి.ద్రవ్యోల్బణం స్థాయి మించిపోయింది.

అక్కడి మార్కెట్లలో కూరగాయలను ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయని జనాలు అంటున్నారు.అసలు శ్రీలంకకు ఈ పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి.

కరోనా వలన ప్రపంచంలోని అనేక దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే కాని శ్రీలంకలా ఏ దేశంలో కూడా పరిస్థితులు మరీ దిగజారి పోలేదు.

శ్రీలంకలో ఉన్న పరిస్థితులు చూస్తే ఎవరికైనా సరే వామ్మో అనిపిస్తుంది.అక్కడ ఒక కేజీ పచ్చి మిర్చి దాదాపు రూ.

710 పలుకుతోంది.ఇక కిలో టమాటాల విషయానికి వస్తే రూ.

200కు కిలోగా అక్కడి వారు విక్రయిస్తున్నారు.ఇవి మాత్రమే కాకుండా అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి.

అక్కడ దాదాపు 5 లక్షల మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువకు జారిపోయే ప్రమాదం ఉందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

ఇలా దేశ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారు కావడానికి అక్కడి లోకల్ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని అనేక మంది ఆరోపిస్తున్నారు.

ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే తీసుకున్న నిర్ణయాల వలనే దేశ పరిస్థితి ఇంతలా దిగజారిందని చెబుతున్నారు.

వ్యవసాయాన్ని 100 శాతం సేంద్రియంగా మార్చాలని అధ్యక్షుడు అవలంభించిన విధానాలే కొంప ముంచాయని అంటున్నారు.

 ఈ వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

జొన్న పంటలో పోషక ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలు..!