నిరుద్యోగులకు శుభవార్త ఫ్లిప్ కార్ట్ లో 70 వేల ఉద్యోగాలు!

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయ్.ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా వెనుకబడిపోయింది.

ఈ కరోనా కారణంగా బడా కంపెనీలే మూసుకున్నాయ్.ఎంతోమంది నిరుద్యోగులు అయ్యి రోడ్డున పడ్డారు.

టీచర్లు సైతం కాయగూరలు అమ్ముకుంటున్న దుస్థితికి కరోనా వైరస్ తీసుకొచ్చింది.ఇక ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ఉన్నప్పటికి దాన్ని ఒక సీజనల్ వైరస్ లా లెక్కలోకి వేసుకొని ఎవరి పని వారు చూసుకుంటున్నారు.

సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్ ఉపయోగించి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ లో మూసుకున్న కంపెనీలు కూడా ఒకొక్కటి తెరుచుకుంటున్నాయ్.

ఇక ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులుగా ఉండే వారికి అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఫ్లిప్ కార్ట్.

భారీగా సీజనల్‌ ఉద్యోగ నియామకాలకు తెర తీసింది ఫ్లిప్ కార్ట్.దేశవ్యాప్తంగా 70 వేల ప్రత్యేక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఓ కంపెనీ.

ఇందులో ప్రత్యేక్ష నియామకాల్ని తన సప్లై చెయిన్‌లో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్‌ పోస్టుల్లో భర్తీ చేయనుంది.

ఇక పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను తన భాగస్వామ్య లొకేషన్లు, కిరాణషాపుల్లో కల్పిచనుంది.త్వరలోనే రానున్న పండుగ సీజన్ లో లక్షల మంది ఈ కామర్స్ కస్టమర్లు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారని.

వారికీ అసౌకర్యంగా ఉండకూడదనే ఈ భారీ నియామకాలను చేపట్టినట్లు కంపెనీ తెలిపింది.అంతేకాదు కస్టమర్లకు కూడా అసౌకర్యం కల్గించకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అని సంస్ద వెల్లడించింది.

గత సంవత్సరంలో ఇదే సమయంలో దాదాపు లక్ష 40 వేల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంది.

కాగా ఇప్పటికే లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ ఈ–కామ్‌ ఎక్స్‌ప్రెస్‌ 30 వేల ఉద్యోగులను ప్రకటించింది.

నెట్ ఫ్లిక్స్ లో చైతన్య శోభిత వెడ్డింగ్… స్ట్రీమింగ్ రైట్స్ ఎంతనో తెలుసా?