7వేల ఏళ్ల నాటి దేవాల‌యం.... పెద్ద మిస్ట‌రీల టెంపులు. !

మ‌న దేశంలో పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి.వాటిల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

అలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయాల్లో నంది తీర్థం కూడా ఒకటి.దీన్నే శ్రీ దక్షిణ ముఖ నంది తీర్థ కల్యాణి క్షేత్ర ఆలయం అని కూడా పిలుస్తారు.

బెంగళూరు నగరానికి వాయువ్య దిశగా ఉన్న మల్లేశ్వర ఆలయం, గంగమ్మ ఆలయాలకు సమీపంలో నంది తీర్థం ఉంటుంది.

1997వ సంవత్సరంలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఈ ఆలయం బయట పడింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / నందితీర్థంలో ఉన్న శివలింగంపై ఎప్పుడూ నీళ్లు పడుతూనే ఉంటాయి.

అక్కడే ఉన్న నంది విగ్రహం నోటి నుంచి ఆ నీళ్లు వస్తుంటాయి.అయితే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు.

ఇకపోతే ఈ ఆలయానికి 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంటుందని కొందరు చెబుతుండగా, మరికొందరు ఈ ఆలయం సుమారుగా 7వేల ఏళ్ల కిందటి నాటిదని అంటున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / దక్షిణముఖ నంది అంటే దక్షిణం వైపుగా ముఖం ఉన్న నంది అని అర్థం వస్తుంది.

ఈ ఆలయంలో ఉన్న నంది నోటి నుంచి వెలువడే నీటిని పవిత్ర జలంగా భక్తులు భావిస్తారు.

దీన్ని కన్నడలో తీర్థ అని పిలుస్తారు.నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి పక్కనే ఉన్న కొలనులోకి ప్రవహిస్తుంది.

ఈ కొలనును కల్యాణి అని పిలుస్తారు.అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం మాత్రం భక్తులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.

! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / .

టైసన్ నాయుడు టీజర్ ఓకే మరి సినిమా పరిస్థితి ఏంటి..?