అమెరికా : క్యాపిటల్ సిబ్బందిపై దాడి.. ట్రంప్ నియమించిన అధికారికి జైలు శిక్ష

జనవరి 6, 2021 నాటి యూఎస్ క్యాపిటల్స్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలలో ప్రమేయం వున్న అధికారికి కోర్టు 70 నెలల జైలు శిక్ష విధించింది.

ఇతనిని తాను అధ్యక్షుడిగా వున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) నియమించారు.

స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఫెడెరికో క్లైన్‌( Federico Klein ).

నాటి ఘటనలో క్యాపిటల్ హిల్స్‌లో భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతో పాటు పలు అభియోగాల్లో దోషిగా తేల్చింది కోర్ట్.

తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మెక్‌ఫాడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.జనవరి 6న మీ చర్యలు దిగ్భ్రాంతికరమైనవి, ఘోరమైనవిగా పేర్కొన్నారు.

ఇది చట్టం ద్వారా ఏర్పడిన ప్రభుత్వమని.వ్యక్తులది కాదని మీ కార్యాలయానికి మీరు ద్రోహం చేశారని మెక్‌ఫాడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"""/" / క్యాపిటల్ హిల్స్‌‌ అల్లర్ల సమయంలో క్లైన్ తొలుత ఒక అధికారిపై దాడి చేస్తూ.

మీరు మమ్మల్ని ఆపలేరు అని చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి.ఆరోజు చాలా ఘటనల్లో పాల్గొన్న క్లెన్.

పశ్చిమ టెర్రస్ టన్నెల్‌లోనూ హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.ఈ శుక్రవారం అతనికి శిక్ష ఖరారు చేసే సమయంలో.

యూఎస్ క్యాపిటల్ మాజీ పోలీస్ సార్జంట్ అక్విలినో( Sergeant Aquilino ) గోనెల్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

పోలీసుల వద్ద వున్న షీల్డ్‌ను లాక్కొని అతను తనపై పలుమార్లు దాడి చేశాడని చెప్పారు.

రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని తన మాదిరే ప్రమాణం చేసిన వ్యక్తి.క్యాపిటల్ హిల్స్‌పై ఈ రకంగా దాడి ఎలా చేస్తారని గోనెల్ ప్రశ్నించారు.

"""/" / మాజీ యూఎస్ మెరైన్ అయిన క్లైన్.సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కలిగి వున్నారని, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లోని సున్నితమైన సమాచారాన్ని పొందవచ్చని ప్రాసిక్యూటర్లు వాదించారు.

ట్రంప్ అధ్యక్ష పదవికి మద్ధతుగా క్యాపిటల్‌పై దాడిలో పాల్గొనడం ద్వారా రాజకీయంగా తన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపించబడి వుండొచ్చని వారు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.

అరెస్ట్ అఫిడవిట్ ప్రకారం.క్లెన్ అల్లర్లలో పాల్గొన్నట్లుగా పలు ఛాయాచిత్రాలను పరిశోధకులు కనుగొన్నారు.

సీఎన్ఎన్ నివేదించిన ప్రకారం.ఆరోజున క్లైన్ ఎరుపు రంగు ‘‘ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’’ టోపీని ధరించాడు.

తర్వాత ‘‘ యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్’’ టోపీ పెట్టుకున్నాడని పరిశోధకులు తెలిపారు.

కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు .. యూకే పార్లమెంట్‌లో తీర్మానం