మహబూబాబాద్ జిల్లాలో 67 వేల ఎకరాలకు పట్టాలు.. మంత్రి కేటీఆర్
TeluguStop.com
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఆయన పైలాన్ ఆవిష్కరించారు.
తరువాత ఎన్టీఆర్ స్టేడియంలో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
51 లక్షల మందికి పట్టాలు అందిస్తోంది ప్రభుత్వం.ఈ వానాకాలం నుంచి పోడు భూముల రైతులకు రైతుబంధు అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
అదేవిధంగా జిల్లాలో 67 వేల ఎకరాలకు పట్టాలు అందిస్తున్నామన్నారు.గిరిజనులకు రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచామని పేర్కొన్నారు.
రాజమౌళి డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ హీరోగా సినిమా.. ఆ రీజన్ వల్లే ఆగిపోయిందట!