లేటు వయసులో ఘాటు ప్రేమ: బ్రిటన్ ఆర్టిస్ట్‌‌తో సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ వివాహం

హరీష్ సాల్వే.పరిచయం అక్కర్లేని పేరు.

భారతదేశంలో పేరు మోసిన లాయర్.తన మేధాశక్తితో, వాగ్ధాటితో ఎన్నో క్లిష్టమైన కేసులు వాదించిన న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్.

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్‌ జైల్లో ఉన్నభారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ (49)కు పాక్‌ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో హరీశ్‌ వాదనలే కీలకం.

సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్‌ సాల్వే ఒక్కో రోజుకి రూ.30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం.

కుల్‌భూషణ్‌ విషయంలో.పాకిస్తాన్‌ కుట్రలు బట్టబయలు చేస్తూ.

ఐసీజే ముందు వివరించారు.దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని హరీశ్ ఒప్పించగలిగారు.

సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసు విచారణలో.భారత్‌ పైచేయి సాధించడంలో సాల్వే కీలక పాత్ర పోషించారు.

అనేక చిక్కుముడులు, రెండు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసును వాదించేందుకు గానూ హరీశ్ కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో 65 ఏళ్ల సాల్వే తన జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

బ్రిటన్‌కు చెందిన ఆర్టిస్టు కరోలిన్ బ్రొసార్డ్‌ (56)ను ఆయన వివాహం చేసుకోనున్నారు.లండన్ చర్చిలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య బుధవారం వీరి వివాహం జరగనుంది.

సాల్వే- కరోలిన్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.హరీశ్ గతంలో మీనాక్షిని వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు సాక్షి సాల్వే, సానియా సాల్వే అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ ఏడాది జూన్‌లో హరీశ్- మీనాక్షిలు చట్టప్రకారం విడాకులు తీసుకున్నారు.అటు కరోలిన్‌కు గతంలోనే వివాహమై.

18 ఏళ్ల కుమార్తె ఉంది.భారత సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ అయిన హరీశ్ సాల్వే.

ఈ ఏడాది జనవరిలో కోర్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్వీన్స్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు.

దీంతో ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో నివసిస్తున్నారు.ఓ ఆర్ట్ ఈవెంట్‌లో హరీశ్ తొలిసారిగా కరోలిన్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది.

థియేటర్, శాస్త్రీయ సంగీతం పట్ల వున్న అభిరుచే ఇద్దరినీ సన్నిహితులను చేసింది.ఇక కరోలిన్‌ను తాను వివాహం చేసుకోనున్నట్లు హరీష్‌ సాల్వే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాబోయే దంపతులకు తోటి న్యాయవాదులు, మిత్రులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?