అక్కినేని వారసుడైన నాగచైతన్య స్టార్ గా ఎదగకపోవడానికి 6 కారణాలు!
TeluguStop.com
అక్కినేని నాగార్జున నట వారసుడు నాగ చైతన్యకు అన్ని రకాలుగా అవకాశాలున్నా స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడు.
మంచి హీరోగా నిరూపించుకునే దమ్మున్నా ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నాడు.తొలి సినిమా జోష్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఇండస్ట్రీ మాట్లాడుకునే స్థాయి హిట్ అందుకోలేక పోయాడు.
ఇంతకు ఆయన ఎందుకు స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడో చూద్దాం!.సినిమా హిట్ కావాలంటే హీరో ఒక్కడే కాదు సత్తా ఉన్న దర్శకుడు కావాలి.
స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలి.కానీ ఇతడు చాలా సినిమాలు కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నాడు.
ఏమాయ చేసావె సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్ మంచి డైరెక్టరే అయినా కమర్షియల్ గా హీరోను నిలబెట్టే దర్శకుడు కాదు.
"""/"/
హీరోని మాస్ హీరోగా చేయాలంటే మాస్ పల్స్ పట్టుకోవాలి.మాస్ డైరెక్టర్ గా గుర్తింపు ఉండాలి.
పూరీ జగన్నాథ్, రాజమౌళి, వినాయక్, బోయపాటి అందులో మంచి అనుభవం ఉన్న డైరెక్టర్లు.
కానీ ఏ అనుభం లేని దర్శకులతో దడ, బెజవాడ లాంటి సినిమాలు చేశవాడు.
ఎక్కువ అంచనాలు పెరగడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అటు నాగా చైతన్య సినిమాలు అన్నింటిలో హీరోయిన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
సినిమా కూడా తన చుట్టే తిరుగుతుంది.ఫలితంగా పేరు కూడా హీరోయిన్ కే వస్తుంది.