5జీ యాక్టివేషన్ లింక్స్‌తో పెద్ద ముప్పు.. క్లిక్ చేశారంటే అంతే సంగతులు!

భారత్‌లో కొద్దిరోజుల క్రితమే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు లాంఛ్‌ చేశాయి.

కాగా యూజర్లు 5జీ ఇంటర్నెట్‌ను తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకునేందుకు అవసరమైన ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అవకాశంగా మార్చుకుని యూజర్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మీ ఫోన్లలో 5Gని యాక్టివేట్ చెయ్యాలంటే ఈ లింకుపై క్లిక్ చేయలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 5జీ యాక్టివేషన్ చేసుకోండి అంటూ వచ్చే లింక్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4జీ నుంచి 5జీకి మారాలని అని చాలామంది యూజర్లకు ఆత్రుత ఉంటుంది.కానీ ఆ ప్రాసెర్‌ను కచ్చితంగా తెలుసుకోవాలి.

అలానే మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్స్‌ ఎట్టి పరిస్థితులలోనూ క్లిక్ చేయకూడదు.అలా చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇక మోసగాళ్లు యూజర్లను నమ్మించడానికి ఆయా టెలికాం కంపెనీల పేర్లతో లింక్‌లు పంపుతారు.

ఎయిర్‌టెల్, జియో కంపెనీల నుంచి ఇవి వచ్చినట్లుగా కనిపిస్తాయి కానీ కేటుగాళ్లు కంపెనీల ముసుగులో వీటిని పంపిస్తారు.

ఈ లింక్స్ పై క్లిక్ చేయకుండా వాటిని వెంటనే డిలీట్ చేసుకోవాలి.ఒకవేళ పొరపాటున క్లిక్ చేసినా మీ పర్సనల్/బ్యాంకింగ్ డిటైల్స్ షేర్ చేయవద్దు.

"""/"/ స్కామర్లు కస్టమర్ కేర్ సిబ్బంది లాగా కాల్ చేసి.ఓటీపీలు లేదా వివరాలు అడిగే అవకాశం కూడా ఉంది.

ఈ వివరాలను షేర్ చేయకపోవడమే శ్రేయస్కరం.మొబైల్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్ల ఆగడాలు అధికమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మొబైల్ యూజర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు కూడా సూచిస్తున్నారు.

ఇంకో విషయం ఏంటంటే, 5జీ మొబైల్ వుంటేనే హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందడం సాధ్యమవుతుంది.

4జీ ఫోన్‌లో కూడా 5జీ యాక్టివేట్ చేసుకోవచ్చని, అందుకు ఒక లింకుపై క్లిక్ చేయాలంటూ వచ్చే మెసేజ్‌లను కూడా నమ్మకూడదు.

ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాదా… సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య