సైనికులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు,53 మంది మృతి

సైనికులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు 53 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు.ఈ ఘటన ఆఫ్రికా దేశం మాలి లో చోటుచేసుకుంది.

సైనికులను టార్గెట్ గా చేసుకున్న ఉగ్రవాదులు ఒక మిలిటరీ పోస్ట్ పై దాడికి పాల్పడడం తో దాదాపు 53 మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

మాలి లోని మేనక ప్రాంతంలో ఉన్న ఒక ఔట్ పోస్ట్ ను ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారని, అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే గత నెలలో బుర్కినో పాసో లో కూడా ఇద్దరు జిహాదీ లు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే మరోసారి ఉగ్రవాదులు సైనికులను టార్గెట్ చేసుకొని ఈ విధంగా ఉగ్రదాడికి పాల్పడ్డారు.

అయితే ఈ తాజా ఘటనలో 53 మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.

అయితే శుక్రవారం చోటుచేసుకున్న ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏ సంస్థ భాద్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఉత్తర మాలి ప్రాంతంలో ఆల్ ఖాయిదా ఉగ్రవాదులు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు.

అయితే ఈ ఉగ్రదాడి వెనుక ఎవరు ఉన్నది అన్న దానిపై అధికారులకు ఎలాంటి స్పష్టత లేదు.

ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముద్రగడ ‘ పై కుమార్తె ఫైర్.. పవన్ కు మద్దతు