పైప్ లైన్ పగిలి కొట్టుకుపోయిన 50 ఇల్లు.. ఊహించని విషాదం..!

సాధారణంగా అకాల వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టించి తీవ్ర నష్టాన్ని మిగిలిస్తాయని అందరికీ తెలిసిందే.

వరదలు వస్తే పంట నష్టంతో పాటు చాలామంది వరదలలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇక ఇండ్లలో, రోడ్లపై వర్షపు నీరు చేరిందంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఒక వాటర్ పైప్ లైన్ పేలడంతో వరదలు వస్తే ఎంత నష్టం కలుగుతుందో అంతే రీతిలో తీవ్ర నష్టం కలిగింది.

అస్సాంలోని గువహాటి( Guwahati In Assam ) లో వాటర్ పైప్ లైన్ పగిలి ఒక మహిళ మృతి చెందగా, ఏకంగా 50 ఇల్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి.

ఇక మరో 19 మంది తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చేరారు.ఇంత బీభత్సం జరిగిందంటే ఇక ఆస్తి నష్టం ఎన్ని లక్షల్లో జరిగిందో ఊహించలేం.

"""/" / వివరాల్లోకెళితే.అస్సాం లోని గువహాటి లోని ఖార్గులీ( Kharguli ) ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అనుకోకుండా వాటర్ పైప్ లైన్ పగలడంతో ఒక్కసారిగా నీరు పెద్ద శబ్దంతో ఎగిసి పడింది.

క్షణాల్లో ఆ నీరంతా ఒక ప్రవాహంలా బయటకు రావడంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ నీటి ప్రవాహంలో ఏకంగా 50 ఇల్లు కొట్టుకుపోయాయి.సుమిత్రా రాభా( Sumitra Rabha ) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.

19 మంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు.ఇక కార్లు, బైకులు ధ్వంసం అయ్యాయి.

"""/" / ఈ పైప్ లైన్ పగలడంతో స్థానికంగా 300 మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తీవ్ర ఆస్తి నష్టం జరగడంతో బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు జరిగిన ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని డిమాండ్ చేస్తున్నారు.దీంతో గువహాటి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.

పైప్ లైన్ పగలడానికి గల కారణాలు ఏమిటో దర్యాప్తు చేసి, బాధితులకు తగిన న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు..!