Healthy Bones : ఎముకల బలానికి కచ్చితంగా తీసుకోవాల్సిన 5 రకాల ఆహారాలు ఇవే!

ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలి అంటే ఎముకలు( Bones ) బలంగా ఉండటం ఎంతో అవసరం.

మన శరీరంలో ఎముకలు కీలక పాత్రను పోషిస్తాయి.నిల‌బ‌డాల‌న్నా, కూర్చోవాల‌న్నా, న‌డవాల‌న్నా, ప‌రుగెత్తాల‌న్నా.

ఎముక‌లు పుష్టిగా ఉండాల్సిందే.లేదంటే చిన్న చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం, ఎక్కువ సమయం పాటు పని చేయలేకపోవటం, కీళ్ళు మోకాళ్ళ నొప్పులు,( Knee Pain ) మెట్లు ఎక్కలేక పోవడం తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇకపోతే ఎముకల ఆరోగ్యానికి కాల్షియం తో పాటు విటమిన్ డి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, జింక్, విటమిన్ కె వంటి పోషకాలు ప్ర‌ధానంగా అవ‌స‌రం అవుతాయి.

అయితే ఈ పోషకాలను అందించి మీ ఎముకల‌ను బలంగా మార్చడానికి ఇప్పుడు చెప్పబోయే ఐదు ఆహారాలు ఉత్తమంగా సహాయపడతాయి.

మరి లేటెందుకు ఆ ఐదు రకాల ఆహారాలు ఏవేవో తెలుసుకుందాం పదండి.ఎముకల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆహారాల్లో బాదం పప్పు( Badam ) ఒకటి.

బాదం పప్పులో కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

కాబట్టి ఎముకల బలానికి ప్రతిరోజు 5 నుంచి 10 వరకు నానబెట్టిన బాదం పప్పులను తప్పక తీసుకోండి.

"""/" / ఎముకలను పుష్టిగా ఉంచుకోవాలని అనుకుంటే వారానికి ఒక్కసారైనా చేపలు( Fish ) తీసుకోండి.

చేపల ద్వారా కాల్షియం, విటమిన్ డి, జింక్, విటమిన్ ఎ వంటి పోషకాలు పొందవచ్చు.

చేపలు ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా మెదడు పని తీరును చురుగ్గా మారుస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.అలాగే ఎముకల బలానికి కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఆకుకూరలు( Green Leafy Vegetables ) ఒకటి.

నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకోవడం వల్ల ఎముకల బలహీనత ఏర్పడకుండా ఉంటుంది.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులకు దూరంగా ఉండవచ్చు. """/" / చియా సీడ్స్( Chia Seeds ) చూడడానికి చిన్న పరిమాణంలో కనిపించినా వీటిలో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.

రోజుకు ఒక స్పూన్ చియా సీడ్స్ ని తీసుకోవడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.

బోన్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.ఇక డ్రై అంజీర్( Dry Anjeer ) కూడా ఎముకల ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్పడతాయి.

రోజుకు రెండు నానబెట్టిన డ్రై అంజీర్ పండ్లను తీసుకుంటే కనుక మీ ఎముకల ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?