వాట్సాప్‌లో చేయకూడని 5 తప్పులు.. చేస్తే అంతే సంగతులు!
TeluguStop.com
ఇండియా కోట్లాదిమంది వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాడుతున్నారు.అయితే ఈ యాప్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి.
అలాగే కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి.లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
నిపుణుల ప్రకారం, వాట్సాప్ యూజర్లు 5 తప్పులు చేయకూడదు.అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఈరోజుల్లో వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌ల ద్వారానే ఫేక్, విద్వేషాలను రెచ్చగొట్టే హానికరమైన సమాచారం వ్యాప్తి అవుతుంది.
సమాజానికి హాని చేసే ఇలాంటి మెసేజ్‌లను ఆలోచించకుండా ఫార్వార్డ్ చేయకూడదు.ఆ మెసేజ్‌లోని నిజానిజాలు, దాని మూలం తెలియకుండా ఫార్వార్డ్ చేయడం కూడా ప్రమాదకరమే.
మెసేజ్‌లను 5 సార్ల కంటే ఎక్కువ సార్లు ఫార్వార్డ్ చేయకుండా వాట్సాప్ ఇప్పటికే ఒక లిమిట్ కూడా తీసుకొచ్చింది.
• కొందరు యూజర్లు ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజ్‌లను పంపిస్తుంటారు.ఇలాంటివారిని మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాట్సాప్ గుర్తిస్తుంది.
అనవసర మెసేజ్‌లను పంపే వారిగా వీరిని పరిగణించి వాట్సాప్ వారి అకౌంట్లను బ్యాన్ చేస్తుంది.
మళ్లీ బ్యాన్ తొలగిపోవాలంటే సరైనా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అందుకే ఒకేసారి ఎక్కువ మందికి ఎక్కువ మెసేజ్‌లు పంపకపోవడం మంచిది.
"""/"/
• కొందరు యూజర్లు అనేక కొత్త కాంటాక్ట్స్‌కి ఒకేసారి అదేపనిగా మెసేజ్ చేస్తుంటారు.
వాటన్నిటికీ రిప్లై రాకపోతే వాట్సాప్ వాటిని గుర్తిస్తుంది.ఆ తర్వాత ఇలాంటి అనవసరపు మెసేజ్‌లు పంపకుండా ఆపేందుకు మీ అకౌంట్ టెంపరరీగా బ్యాన్ చేయొచ్చు
• కొందరు ఎవరిని పడితే వారిని తమ గ్రూపుల్లో చేర్చుకుంటారు.
ఇది ప్రైవసీకి చాలా ముప్పు చేకూరుస్తుంది.కాబట్టి కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీని మాత్రమే తమ పర్సనల్ గ్రూప్ లో యాడ్ చేసుకోవాలి.
• అబద్ధాలను, ఇల్లీగల్ మెసేజ్‌లు, పరువుకు నష్టం కలిగించేవి, బెదిరింపు, వేధించేలాంటి మెసేజ్‌లు పంపడం కూడా వాట్సాప్‌లో నిషేధం.
ఈ గైడ్ లైన్స్ ఫాలో కాకపోతే వాట్సాప్ బ్యాన్ చేస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలివేనా?