నల్గొండ జిల్లా:నల్గొండ జిల్లా మిర్యాలగూడ( Miryalaguda )లో అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి
ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) సంభవించింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.అదుపు తప్పి పల్టీ కొట్టిన కారును
గుర్తు తెలియని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతోభారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ,ఇతర ప్రాంతాలకు దైవదర్శనానికి వెళ్లారు.తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా అద్దంకి- నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనుక నుంచి కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో మహేష్ భార్య జ్యోతి(30),కుమార్తె రిషిత(6),మహేశ్ తోడల్లుడు,యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్ (32),ఆయన కుమారుడు లియాన్సీ (2) అక్కడికక్కడే మృతి చెందారు.
మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు.ఆమెకు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి తరువాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.