World’s Best School Prize : తుది జాబితాలో 5 భారతీయ పాఠశాలలు.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

ప్రపంచ యవనికపై భారతీయ పాఠశాలలు, భారతీయ విద్యా వ్యవస్థ సత్తా చాటుతున్నాయి.సమాజ పురోగతికి తమ అపారమైన సహకారం అందించిన స్కూల్స్‌ను సత్కరించేందుకు గాను యూకేలో ప్రారంభమైన వరల్డ్స్ బెస్ట్ స్కూల్ ప్రైజ్‌లలో భారతీయ స్కూల్స్ సత్తా చాటాయి.

ఇందులో వివిధ కేటగిరీలలోని టాప్ 10 షార్ట్‌లిస్ట్‌లలో ఐదు ఇండియన్ స్కూల్స్ చోటు దక్కించుకున్నాయి.

దీనిలో భాగంగా ముంబైకి చెందిన సీఎన్‌ఎం స్కూల్‌, ఢిల్లీలోని లజపత్‌‌నగర్‌ఎస్‌డీఎంసీ ప్రైమరీ స్కూల్‌ ఇన్నోవేషన్‌ కేటగిరీలో అవార్డుకు ఎంపికయ్యాయి.

అలాగే ముంబైలోని ఖోజ్‌ స్కూల్‌, పుణేలోని పీసీఎంసీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌.సమాజంతో భాగస్వామ్యం అనే కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి.

హౌరాలోని సమరితాన్‌ మిషన్‌ స్కూల్‌.ప్రతికూలతలను అధిగమించిన జాబితాలో ఎంపికైంది.

ఈ ఐదు కేటగిరీలకు సంబంధించి 2,50,000 అమెరికన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.

2 కోట్లు) ప్రైజ్‌ మనీని విజేతలకు సమానంగా పంచుతారు. """/"/ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 1.

5 బిలియన్ల మంది అభ్యాసకులు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల మూసివేతతో ప్రభావితమయ్యారు.2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే విధానంలో పురోగతి నెమ్మదించిందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించిందని ఈ అవార్డుల వ్యవస్థాపకుడు వికాస్ పోటా అన్నారు.

వ్యవస్థాగత మార్పును రూపొందించడంలో సహాయపడటానికి తాము.అట్టడుగు స్థాయి పరిష్కారంగా బెస్ట్ స్కూల్స్ అవార్డులను ప్రారంభించినట్లు వికాస్ తెలిపారు.

యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యయాసన్ హసనా, టెంపుల్‌టన్ వరల్డ్ ఛారిటీ ఫౌండేషన్, లెమాన్ ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో యూకే కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ T4 ఎడ్యుకేషన్ ద్వారా వరల్డ్స్ బెస్ట్ స్కూల్ ప్రైజ్‌లు స్థాపించబడ్డాయి.

ఈ ఏడాదికి గాను సంవత్సరాంతంలో విజేతను ప్రకటిస్తారు.పబ్లిక్ అడ్వైజరీ ఓటింగ్ తర్వాత, ప్రతి విభాగంలో విజేతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులతో కూడిన జడ్జింగ్ అకాడమీ ఎంపిక చేస్తుంది.

ఈ రోజు జరిగే ముంబై Vs పంజాబ్ మ్యాచ్ లో ముంబై గెలవాలంటే ఇలా చేయాల్సిందే…