రాత్రికి రాత్రే రైతు ఖాతాలో రూ.473 కోట్లు… ఎలా వచ్చాయంటే?

రాత్రికి రాత్రే రైతు ఖాతాలో రూ.473 కోట్లు… ఎలా వచ్చాయంటే?

సాధారణంగా కొన్ని సార్లు మన ఖాతాలోకి మనకు తెలియకుండానే డబ్బు జమ అవుతుంది.

రాత్రికి రాత్రే రైతు ఖాతాలో రూ.473 కోట్లు… ఎలా వచ్చాయంటే?

అయితే పొరపాటుగా అకౌంట్ నెంబర్ తప్పుగా ఉంటే ఇలా మన ఖాతాలో డబ్బు జమ అవుతుండటం మనం చూస్తూ ఉంటాం.

రాత్రికి రాత్రే రైతు ఖాతాలో రూ.473 కోట్లు… ఎలా వచ్చాయంటే?

ఈ తరహాలోనే ఒక రైతుకు రాత్రికి రాత్రే తన ఖాతాలో ఏకంగా రూ.

473 కోట్ల రూపాయలు జమ అయ్యాయి.ఒక్కసారిగా తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ రైతు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ తాజా సంఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.

యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో నివసించే రైతు అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు రాత్రికి రాత్రే తన బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు జమయ్యాయి.

భువనగిరి డక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉన్న సంజీవరెడ్డి బుధవారం పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు వెళ్లాడు.

అతనికి కొంతమేర డబ్బు అవసరమైతే ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించాడు.

ఎన్ని సార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో ఒకసారి తన అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు.

"""/"/ ఒక్కసారిగా తన అకౌంట్లో బ్యాలెన్స్ ని చూసిన రైతు ఎంతో ఆశ్చర్యానికి గురై, ఆ ఎటిఎం పని చేయడం లేదని భావించి,ఎస్‌బీఐ ఏటీఎంలో కూడా చెక్‌ చేశాడు.

అక్కడా ఆ రైతు ఖాతాలో ఏకంగా రూ.473,13,30,000 డబ్బును చూసేసరికి అతనికి ఏం చేయాలో దిక్కు తోచలేదు.

అతని ఖాతాలో అంత మొత్తంలో డబ్బులు ఉన్నా ఏటీఎంలో ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి డక్కన్ గ్రామీణ బ్యాంకు కు వెళ్ళాడు.

బ్యాంకుకు వెళ్లి అధికారులకు జరిగిన విషయం మొత్తం వివరించాడు.దీంతో అధికారులు చెక్ చేసి మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందని.

ఏటీఎం సర్వర్ పనిచేయకపోవడం వల్ల డబ్బులు రాలేదని వారు ఆ రైతుకు తెలిపారు.

ఏటీఎం నుంచి బ్యాలెన్స్ చెక్ చేసిన రిసిప్ట్ లో ఇంత మొత్తంలో అమౌంట్ చూపిస్తుందని రైతు తెలుపగా అందుకు అధికారులు మీ ఖాతాలో కేవలం 4 వేల రూపాయలు ఉన్నాయని తెలిపారు.

అయితే ఇతని ఖాతాలో రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు జమ అయ్యాయన్న వార్త రెండు రోజుల పాటు బాగా చర్చనీయాంశంగా మారింది.

రష్యన్ జాలరికి చిక్కిన వింత జీవి.. గ్రహాంతరవాసియేనా అంటూ నెటిజన్ల చర్చలు!