విషాదం : 15 ఏళ్ల వయసులో పొట్టచేత పట్టుకొని అమెరికాకి, రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన మృత్యువు

అమెరికా( America )లో విషాదం చోటు చేసుకుంది.గత వారం ఇండియానాపోలీస్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 42 ఏళ్ల భారతీయ అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని సుఖ్వీందర్ సింగ్‌గా గుర్తించారు.ఇతను తీవ్ర గాయాలతో అక్టోబర్ 13న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఇండియానాపోలిస్( Indiana Police ) సమీపంలోని గ్రీన్‌వుడ్ రూరల్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ జిల్లాకు చెందిన సింగ్.1996లో 15 ఏళ్ల వయసులో అమెరికాకు వలస వచ్చాడు.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం.అక్టోబర్ 12న సాయంత్రం రెండు వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో సుఖ్వీందర్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాథమిక దర్యాప్తులో సింగ్ నడుపుతున్న హోండా అకార్డ్ ఎదురుగా వున్న లేన్‌లోకి వెళ్లి.

క్యాడిలాక్ ఎస్కలేడ్‌పైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. """/" / ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సుఖ్వీందర్ సింగ్‌( Sukhwinder Singh )కు భార్య, 15 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె వున్నారు.

ఆయన 2010 నుంచి ఇండియానాపోలిస్‌లో నివసిస్తున్నాడు.మరోవైపు.

కాడిలాక్ నడుపుతున్న డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మరో మహిళకు కూడా తీవ్రగాయాలు కావడంతో వారిని ఐయూ హెల్త్ మెథడిస్ట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా.అమెరికాలో కొద్దినెలల క్రితం రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు యువతి జాహ్నవి కందుల దుర్మరణం పాలైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటుందనుకున్న కుమార్తె తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుముున్నీరుగా విలపిస్తున్నారు.

"""/" / కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి.

సీటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు.జనవరి 23న కళాశాలకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

నెలలు గడుస్తున్నా ఈ షాక్ నుంచి వీరి కుటుంబం తేరుకోలేదు.ఇంతటి విషాదం నింపిన ఈ ఘటన గురించి అమెరికాలో ఓ పోలీస్ అధికారి చులకనగా మాట్లాడాడు.

జోకులు వేసుకుంటూ , చిరునవ్వులు చిందించాడు.అతగాడి మాటలన్నీ బాడీకామ్ కెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్ అయ్యాయి.

దీంతో అతని తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.