తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు
TeluguStop.com
అమెరికాలోని శాన్ ఆంటోనియాలో( San Antonio ) భారత సంతతికి చెందిన 42 ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు.
ఓ కేసుకు సంబంధించి మృతుడిని పట్టుకునేందుకు పోలీసులు వెంబడించగా.ఇద్దరు అధికారులను తన వాహనంతో ఢీకొట్టడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు అతనిని కాల్పులు జరిపారు.
మృతుడిని సచిన్ సాహూగా( Sachin Sahoo ) పేర్కొన్నారు.ఏప్రిల్ 21న పోలీస్ అధికారి టైలర్ టర్నర్( Tyler Turner ) అతనిపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాహో అమెరికా వచ్చి ఇక్కడి పౌరసత్వం పొందాడు.ప్రాథమిక విచారణ ప్రకారం .
ఏప్రిల్ 21న సాయంత్రం 6.30 గంటలలోపు శాన్ ఆంటోనియోలోని చెవియోట్ హైట్స్‌లోని( Cheviot Heights ) ఒక ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు దాడికి పాల్పడ్డాడు.
దీనిపై ఆరా తీసేందుకు పోలీసులను ఘటనాస్థలికి పంపినట్లు శాన్ ఆంటోనియో పోలీస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
అక్కడికి చేరుకున్న అధికారులు 51 ఏళ్ల మహిళను ఉద్దేశపూర్వకంగా వాహనంతో ఢీకొట్టినట్లు గుర్తించారు.
ఘటన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పారిపోయాడు.పరిస్ధితి విషమంగా వుండటంతో బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై విచారణలో భాగంగా శాన్ ఆంటోనియో పోలీస్ డిటెక్టివ్‌లు అతనిపై నేరపూరిత అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
"""/" /
కొద్దిగంటల తర్వాత సాహో ఇంటికి వచ్చినట్లుగా ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న ఇద్దరు పోలీస్ అధికారులను సాహో తన వాహనంతో ఢీకొట్టగా.అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
దీంతో ఓ అధికారి సాహోపై కాల్పులు జరిపాడు.ప్రమాదంలో గాయపడిన అధికారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని, శాన్ ఆంటోనియా పోలీస్ శాఖ పేర్కొంది.
"""/" /
తనతో కలిసి రూమ్‌మేట్‌గా వున్న మహిళను సాహూ వాహనంతో ఢీకొట్టినట్లు పోలీస్ చీఫ్ బిల్ మెక్‌మనస్( Police Chief Bill McManus ) తెలిపారు.
బాధిత మహిళకు అనేక శస్త్రచికిత్సలు జరిగాయని , ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా వుందని ఆయన వెల్లడించారు.
మరిన్ని వాస్తవాలను వెలికితీసేందుకు బాడీక్యామ్ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారని మెక్‌మనస్ చెప్పారు.అయితే మృతుడు సాహో బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా సాహో మాజీ భార్య లేహ్ గోల్డ్ స్టెయిన్ చెప్పినట్లుగా ఓ మీడియా నివేదిక పేర్కొంది.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?