ఒకేరోజు నాలుగు సినిమాలు రిలీజ్.. ఏది హిట్, ఏది ఫట్?

ఈ మధ్యకాలంలో సినిమాలు థియేటర్లలో వరుసగా విడుదల అవుతున్నాయి.అంతేకాకుండా విడుదలైన సినిమాలు చాలావరకు సక్సెస్ ను అందుకుంటున్నాయి.

వారానికి కనీసం రెండు సినిమాలు అయినా సరే బాక్సాఫీస్ అందరూ చేస్తున్నాయి.దర్శక నిర్మాతలు కూడా ప్రేక్షకుల అభిరుచుల మేరకు డిఫరెంట్,డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇది ఇలా ఉంటే సౌత్ లో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లో విడుదల చేయడానికి రెడీ అయ్యాయి.

ఈ నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్ కథలు కావడం విశేషం. """/"/ ఈ నాలుగు సినిమాల్లో మూడు కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కాగా ఒకటి యాక్షన్ తో పాటుగా కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది.

ఆ సినిమాలు ఏంటి అన్న వివరాల విషయానికి వస్తే.టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా నేడు థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర బృందం భారీగా ప్రమోషన్స్ ను చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జిన్నా సినిమా హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రానుంది.ఇకపోతే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా కూడా నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇది రొమాంటిక్ అండ్ లవ్ కామెడీగా ఎక్కింది.అయితే ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్స్ ఏవి చేయలేదు.

మరి ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారో ఏదో చూడాలి మరి. """/"/ గత సినిమాతో మంచి హిట్ ను అందుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంటాడో లేదో చూడాలి మరి.

అలాగే హీరో శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమా కూడా నేడు థియేటర్లలో విడుదల అయ్యింది.

ఈ సినిమా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైన్ గా రూపొందిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నిలుకున్నాయి.ప్రేక్షకులు కూడా ఈ సినిమా బాగానే ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే తమిళ హీరో కార్తీ నటించిన సర్దార్ సినిమా కూడా నేడు థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాలో ప్రేమికుల మధ్య లాంగ్వేజ్ కష్టాలు ఏ విధంగా ఉంటాయి అన్నది చక్కగా తెరకెక్కించారు.

ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.మరి థియేటర్లో ఒకే రోజున విడుదలవుతున్న ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చూడాలి మరి.

అలాగే ఈ సినిమాలలో ఏ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అన్నది కూడా తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

ఈ ఆయిల్ ను వాడితే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు!