నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నలుగురు భారతీయ యువకులు

నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నలుగురు భారతీయ యువకులు

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసుతో సంబంధం ఉన్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయ యువకులను కెనడా అధికారులు బుధవారం బ్రిటీష్ కొలంబియా కోర్టు( British Columbia Court ) ఎదుట హాజరుపరిచారు.

నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నలుగురు భారతీయ యువకులు

ఈ సందర్భంగా న్యాయస్థానం విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.కస్టడీ నుంచే కరణ్ బ్రార్ (22),( Karan Brar ) కమల్ ప్రీత్ సింగ్ (22),( Kamalpreet Singh ) కరణ్ ప్రీత్ సింగ్ (28),( Karanpreet Singh ) అమన్‌దీప్ సింగ్ (22)లను( Amandeep Singh ) వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరుపరిచారు.

నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నలుగురు భారతీయ యువకులు

"""/" / అమన్‌దీప్ సింగ్ మే 15న మొదటిసారిగా కోర్టులో హాజరుకాగా.మిగిలిన ముగ్గురు మే 7న న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు.

మే 21న నలుగురు కలిసి కోర్టు ముందుకు వచ్చారు.ఈ నలుగురూ ఫస్ట్ డిగ్రీ హత్య, హత్యకు కుట్రపన్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

అమన్‌దీప్ సింగ్ ఇప్పటికే పీల్ రీజనల్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.తుపాకీని అనధికారికంగా కలిగి ఉండటం వంటి 9 ఆరోపణలపై నవంబర్ 2023లో ఇతనిని అరెస్ట్ చేశారు.

మిగిలిన వారిని మే 3న ఎడ్మాంటన్ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం బ్రిటీష్ కొలంబియాకు తీసుకొచ్చారు.

నాటి నుంచి ఈ కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. """/" / అయితే నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్ ప్రమేయం ఉన్నట్లుగా కెనడియన్ పరిశోధకులు రుజువు చేయలేకపోయారు.

కెనడాలో జరుగుతున్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు.

ఖలిస్తానీ వేర్పాటువాద అంశాలకు పొలిటికల్ స్పేస్ ఇవ్వడం ద్వారా కెనడా ప్రభుత్వం తమ ఓటు బ్యాంక్.

చట్టబద్ధమైన పాలన కంటే శక్తివంతమైనదనే సందేశాన్ని పంపుతోందన్నారు.భారతదేశం వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుంది, ఆచరిస్తుందన్నారు.

అయితే అది విదేశీ దౌత్యవేత్తలను బెదిరించే స్వేచ్ఛతో సమానం కాదని.వేర్పాటువాదానికి, హింసను సమర్ధించే అంశాలకు పొలిటికల్ స్పేస్‌ను అనుమతించదన్నారు.

వారానికి 2 సార్లు ఈ చిట్కాను పాటిస్తే అండర్ ఆర్మ్స్ వైట్ గా మారడం గ్యారెంటీ!