యూకేలో భారతీయ విద్యావేత్తకు బహిష్కరణ ముప్పు.. కొంపముంచిన ఆ నిబంధన

యూకేలో భారతీయ విద్యావేత్తకు బహిష్కరణ ముప్పు కొంపముంచిన ఆ నిబంధన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) ప్రస్తుతం తమ దేశంలో అక్రమంగా ఉన్న విదేశీయులను తరలిస్తున్న సంగతి తెలిసిందే.

యూకేలో భారతీయ విద్యావేత్తకు బహిష్కరణ ముప్పు కొంపముంచిన ఆ నిబంధన

ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉన్నారు.ట్రంప్ బాటలో మరికొన్ని దేశాలు కూడా తమ దేశాల్లో ఉన్న అక్రమ వలసదారులను బహిష్కరించాలని భావిస్తున్నాయి.

యూకేలో భారతీయ విద్యావేత్తకు బహిష్కరణ ముప్పు కొంపముంచిన ఆ నిబంధన

ఈ లిస్ట్‌లో బ్రిటన్ కూడా ఉంది.కైర్ స్టార్మర్ నేతృత్వంలోని యూకే( UK ) ప్రభుత్వం అక్రమ వలసలపై దృష్టి సారించింది.

భారత్‌కు చెందిన ఓ చరిత్రకారిణి తాజాగా యూకే ప్రభుత్వం నుంచి బహిష్కరణ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.

దేశం వెలుపల ఎక్కువ రోజులు గడిపినందుకు గాను ఆమె మెడపై బహిష్కరణ( Deportation ) కత్తి వేలాడుతోంది.

37 ఏళ్ల డాక్టర్ మణికర్ణికా దత్తా( Manikarnika Dutta ) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో( University Of Oxford ) చరిత్రపై పరిశోధనలు చేస్తున్నారు.

ఆమె భారతదేశంలోని పలు అంశాలపై పరిశోధన చేయాల్సి రావడంతో నిరవధిక సెలవు కోసం దరఖాస్తు చేసుకునే ముందు 10 ఏళ్ల కాలంలో 691 రోజులు యూకే వెలుపల గడిపారు.

నిరవధిక సెలవు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు తమ దరఖాస్తుకు ముందు 10 సంవత్సరాల లోపు విదేశాలలో 548 రోజుల కంటే ఎక్కువ సమయం గడపకూడదని హోం ఆఫీస్ నిబంధనలు చెబుతున్నాయి.

"""/" / ఈ క్రమంలోనే 691 రోజులు విదేశాల్లో గడిపిన దత్తా నిరవధిక సెలవు దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

దశాబ్ధకాలంగా యూకేలో నివసిస్తున్న మణికర్ణిక ఇప్పుడు బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు.ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతం ఎంతో భయంతో బతుకుతున్నానని మణికర్ణిక తెలిపింది.

హోం ఆఫీస్ కఠినమైన నియమాలు విద్యా పరిశోధన అవసరాలను, అంతర్జాతీయ విద్యావేత్తల పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోవడం లేదని దత్తా చెప్పారు.

"""/" / మీ మొదటి ప్రాధాన్యత, మీ నిబద్ధత.విద్యావేత్తలు చేయగల ఉత్తమ పరిశోధన పట్ల ఉండాలని ఇందుకోసం ఏం అవసరమో గుర్తించాలని అంతేకానీ రోజుల సంఖ్యను లెక్కించడం కాదని మణికర్ణక అన్నారు.

దత్తా గ్లాస్గో యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న సౌవిక్ నహా భార్య.ఆయన కూడా అక్టోబర్ 2024లో నిరవధిక సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా సౌవిక్ అభ్యర్ధనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

ఆ మాటకు మబ్బులు విడిపోయాయి.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆ మాటకు మబ్బులు విడిపోయాయి.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!