తెలంగాణాలో విజృంభిస్తున్న కరోనా,ఎర్రగడ్డ లో ఏకంగా 36 మందికి
TeluguStop.com
తెలుగు రాష్ట్రం తెలంగాణా లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.
ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ వైరస్ కేసులు మరింత ఎక్కువైపోతున్నాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 92 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 7 వందలకు పైగా నమోదు అయ్యింది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా ఒక్క గ్రేటర్ పరిధిలో 147 పాజిటివ్ కేసులు నమోదు కాగా కేవలం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లోనే ఏకంగా 36 పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం గమనార్హం.
ఈ 36 మందిలో ఆస్పత్రి సిబ్బంది తో పాటు మానసిక రోగులు ఉన్నట్లు సమాచారం.
దీనితో పాజిటివ్ వచ్చిన వీరిందరిని కూడా అక్కడే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలోనే గత కొద్దీ రోజులుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ కొవిడ్ సెంటర్‌లో 200 మంది చికిత్స పొందుతుండగా, తాజాగా అదే హాస్పటల్ కు చెందిన 36 మందికి పాజిటివ్ రావడం తో వారందరినీ కూడా ఆ కోవిడ్ సెంటర్ కే తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
అబ్బో, ఎంత మర్యాదో: జంటకు ఇబ్బంది కలగకూడదని వేచి ఉన్న పెంగ్విన్.. వీడియో వైరల్!