తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

తెలంగాణలో ఎల్లుండి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.

ఈ క్రమంలోనే ఇవాళ రాత్రి వరకు ఎపిక్ కార్డుల పంపిణీ ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ పేర్కొన్నారు.

సుమారు 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జరగనుందని చెప్పారు.అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.