హరితహారంలో భాగంగా 3500 ఈత మొక్కలు నాటారు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : హరితహారం లో భాగంగా 3500 ఈత మొక్కలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గౌడ సోదరులు నాటారు.
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో ఒకేసారి 3500 ఈత మొక్కలను గౌడ సంఘం నాయకుల సహకారంతో రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో నాటారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది సదర్ అలీ, అమృత్ రెడ్డి, రాజేందర్, రాజు,కిషోర్ కుమార్, మల్లేష్, దివ్య భవాని, గౌడ సంఘం నాయకులు బోల్గం శ్రీనివాస్, లింగాల యాదగిరి, ముస్కంటి శ్రీనివాస్, ముస్కంటి రమేష్,లింగాల అంజయ్య, బొల్గం రంగయ్య, గోవర్ధన్, లక్ష్మీనారాయణ, పాముల స్వామి, కిష్టయ్య, లింగాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
డబ్బు లాక్కొని హీరోయిన్ కు చుక్కలు చూపించిన బిచ్చగాడు.. అసలేం జరిగిందంటే?