సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 350 కి.మీ. వెళ్లనున్న ఎలక్ట్రిక్ బైక్.. ప్రత్యేకతలు ఇవే
TeluguStop.com
ఈ-బైక్‌లు ఇటీవలి సంవత్సరాలలో సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూలమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి.అమెరికన్ కంపెనీ యూనోరా ఇ-బైక్‌ల( Unora E-bikes ) తయారీలో ప్రత్యేకత కలిగిన సంస్థ.
దాని ఫ్లాష్ ఇ-బైక్ సిరీస్ కోసం కొత్త ఇండీగోగో పేరుతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించింది.
ఈ తరుణంలో ఫ్లాష్ సిరీస్‌లో మూడు మోడళ్ల ఈ-బైక్‌లను అందుబాటులో తీసుకొచ్చింది.ఫ్లాష్-లైట్, ఫ్లాష్-ఏడబ్ల్యూడీ( Flash-Lite, Flash-AWD ), ఫ్లాష్ అనే ఈ-బైక్ మోడల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ప్రతి మోడల్ విభిన్న స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.వినియోగదారులు తమ అవసరాలకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు.
ఇందులో బైక్‌లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 350 కి.మీ దూరం ప్రయాణించనున్నాయి.
వీటి గురించి తెలుసుకుందాం. """/" /
ఫ్లాష్ లైట్ మోడల్‌లో 750 వాట్స్ మోటార్ ఉంటుంది.
దీనిలో 2,808 వాట్ అవర్ బ్యాటరీ అమర్చారు.దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
ఈ బైక్‌తో 220 మైళ్లు లేదా 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.హైడ్రాలిక్ లాకౌట్ ఫ్రంట్ సస్పెన్షన్,( Hydraulic Lockout Front Suspension ) 20 X 4-ఇన్ ఫ్యాట్ టైర్లు ఫ్లాష్ సిరీస్‌లోని ప్రత్యేక లక్షణాలలో ఒకటి.
ముఖ్యంగా రాళ్లు, గోతులు ఉండే కఠినమైన భూభాగాలపై కూడా చక్కగా రైడ్ చేసేందుకు, సౌకర్యవంతంగా చేయడానికి ఇవి సహాయపడతాయి.
బైక్‌లు 150 లక్స్ హెడ్‌లైట్‌ను కలిగి ఉంటాయి.రాత్రి వేళ ఇది ప్రకాశవంతంగా దారి చూపిస్తాయి.
మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి బ్రేక్ హ్యాండిల్స్‌లోని మోటారు కట్-ఆఫ్ సెన్సార్ అమర్చారు.ఇందులో బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో తెలిపేలా ఎల్‌సీడీ ప్యానెల్ కూడా అమర్చారు.
తద్వారా బ్యాటరీ లైఫ్ ఎంత ఉంది, ఎంత దూరం ప్రయాణించవచ్చు అనే విషయాలను ముందుగానే అంచనా వేసుకోవచ్చు.
వీటి ప్రారంభ ధర 1499 యూఎస్ డాలర్లు ఉంటుంది.మన కరెన్సీలో రూ.
ఏసు భాయిగా రాబోతున్న నటి రష్మిక మందన్న….మరో హిట్ గ్యారెంటీ?