కల్కి సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ వైరల్.. దీపిక రోల్ అలా ఉంటుందంటూ?
TeluguStop.com
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కల్కి.
(
Kalki ) ఇప్పటికే పార్ట్ 1 విడుదల కాగా పార్ట్ 2 త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే.
పార్ట్ 2 కోసం ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పటివరకు మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ను విడుదల చేయలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి నిర్మాతలు స్వప్న( Swapna ) ప్రియాంక( Priyanka ) స్పందించారు.
"""/" /
గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకలలో భాగంగా స్వప్న ప్రియాంక మాట్లాడుతూ.
ప్రభాస్ కల్కి పార్ట్ 2కు( Kalki 2 ) సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.అన్ని సిద్ధమయ్యాక ప్రకటిస్తాము.
కల్కి 2898 ఏడీ సినిమాలో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె,( Deepika Padukone ) పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనున్నారు అని తెలిపారు.
కల్కి 2898 ఏడీ సినిమాతో పాటే సీక్వెల్ కు సంబంధించిన షూట్ ను కొంతమేర షూట్ చేసినట్లు తెలిపారు.
పార్ట్ 2కు సంబంధించి 35 శాతం షూట్ జరిగిందని వివరించారు. """/" /
ఈ సందర్భంగా ఈ వేడుకలో భాగంగా స్వప్న అలాగే ప్రియాంకలు చేసిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మించిన ఈ సినిమా విడుదల అయ్యి 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు.బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.
మంచు విష్ణు కన్నప్ప బిజినెస్ పరంగా ఓకే మరి సక్సెస్ పరంగా ఏం చేయబోతున్నాడు…