మొండిగా వ్యవహరించిన ప్రభుత్వం,చివరికి మూల్యం చెల్లించుకుంది…

అందరిదీ ఒకదారి అయితే ఉల్లిపొట్టుది ఒక దారి అన్న సామెత ప్రకారం కర్ణాటక ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శల పాలవుతుంది.

దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా విద్యార్థుల ఎగ్జామ్స్ ను క్యాన్సిల్ చేసుకుంటూ రాగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం పట్టుబట్టి మరీ SSLC పరీక్షలు జరిపింది.

దీనితో ఈ పరీక్షల కోసం మొత్తం 761506 మంది విద్యార్థులు హాజరు అయినట్లు తెలుస్తుంది.

అయితే అసలు ఈ పరీక్షలు వద్దని అటు ప్రతిపక్షం, ప్రజలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులూ అందరూ కోరినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా పరీక్షలు జరిగి తీరాల్సిందే అని పట్టుబట్టడం తో జూన్ 25 నుంచి వారికి పరీక్షలు ప్రారంభమై జులై 3 తో ముగిశాయి.

అయితే తాజాగా వెల్లడైన అంశం ఏమిటంటే ఇలా SSLC పరీక్షలకు హాజరైన వారిలో 32 మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది.

తాజాగా పరీక్షలు రాసిన వాళ్లలో 32 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పుడా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన మాటలకందనిది.ఈ SSLC ఎగ్జామ్ జూన్ 25 నుంచి జులై 3 వరకూ జరుగగా, కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించినట్లు ప్రభుత్వం చెబుతోంది.

కానీ శనివారం రిలీజ్ చేసిన డేటాలో 32 మంది కరోనా ఉందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జులై 3న చివరి ఎగ్జామ్ జరిగింది కాబట్టి అప్పటి నుంచి 14 రోజులు అంటే జులై 17 వరకూ విద్యార్థులకు ఎప్పుడైనా కరోనా లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది.

కావున దీనితో ఎవరెవరికి అయితే పాజిటివ్ అని తేలిందో వారు ఎంతమంది తో కాంటాక్ట్ అయ్యారు, కేవలం పరీక్షలు జరిగిన 9 రోజుల్లోనే 32 మందికి వైరస్ సోకిందంటే ఇంకా ఎంతమందికి అది సోకిందో ఏమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోపక్క మిగిలిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న భయాందోళన వ్యక్తం అవుతుంది.

ప్రస్తుతం మరో 80 మంది విద్యార్థుల్ని ప్రభుత్వం ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఎందుకంటే.ఆ 80 మంది విద్యార్థులూ.

ఈ 32 మంది విద్యార్థులకు ప్రైమరీ కాంటాక్ట్స్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.

నిత్యం నిమ్మ‌ర‌సం తీసుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!