పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది… ముహూర్తపు కేలండర్ ఇదే, 40 రోజుల్లో 32లక్షల పెళ్లిళ్లు!

ఇండియన్ వెడ్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.యావత్ ప్రపంచంలోనే భారతీయుల పెళ్ళికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు వుంది.

వివిధ దేశాలు వారి వివాహ వేడుకలు ఎంతో ఆడంబరంగా జరిపించుకుంటున్నప్పటికీ భారతీయ సనాతన వివాహానికి ఓ ప్రత్యేకమైన స్థానం వుంది.

అందుకే విదేశీయులు సైతం మన ఇండియన్ స్టైల్ వెడ్డింగ్ జరుపుకుంటూ వుంటారు.వివాహం అనేది రెండు జీవితాల అపురూప కలయిక.

దానికోసం ఎన్నో సంవత్సరాలు నిరీక్షిస్తుంటారు.ఆ సమయం వచ్చినపుడు ఎవరిస్థాయిలో వారు ఘనంగా వివాహాలను జరుపుకుంటారు.

ఇకపోతే కాస్త గ్యాప్ తరువాత పెళ్లిళ్ల సీజన్ మరలా పుంజుకుంది.అవును, మంచి ముహూర్తాలు లేకపోవడంతో 3 నెలల నుంచి వివాహ వేడుకలు ఆగిపోయాయి.

అయితే ఈ నెల 4 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు మొదలు అయ్యాయి.

దీంతో జనవరి 14 వరకు 40 రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 32 లక్షల జంటలు ఒకటి కానున్నాయని సర్వేలు చెబుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి, ఎంతమంది వివాహ కలయిక కోసం ఎదురు చూస్తున్నారో.

"""/"/ ఈ నెల 4 నుండి పెళ్లి ముహుర్తాలు ఆయా వధూవరుల జాతకాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు.

జనవరి 14 వరకు నిరాటంకంగా వివాహాలకు శుభసూచిక అని దైవజ్ఞులు చెబుతున్నారు.వివరాలకోసం వధూవరుల పుట్టినతేది, నక్షత్రాల వివరాలు పురోహితుల దగ్గరికి తీసుకెళ్ళినచో వివరాలు చెబుతారు.

ఇక ఈ సీజన్ లో ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షలు పెళ్లిళ్లు అవుతాయని భోగట్టా.

అందువలన రూ.3.

75 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరగనున్నాయని ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తాజాగా అంచనా వేసింది.

నాగ్ అశ్విన్ కోసం తండ్రితో గొడవపడ్డ అశ్విని దత్ కూతురు చివరికి తోడల్లుడి ఎంట్రీ ..!